ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత నిరంతరం అభివృద్ధి చెందుతోంది. 10 సంవత్సరాల క్రితం మనం అనుకున్నవి ప్రస్తుతం సాంకేతికత సహాయంతో నేడు జరిగిపోతున్నాయి. డ్రైవర్ లేకుండా కారు నడవగలదా అని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతుంటాము.. కానీ, నేడు టెక్నాలజీ ఎంత స్థాయికి చేరుకుందంటే..మార్కెట్లలో డ్రైవర్ లెస్ కార్లు వస్తున్నాయని, రోడ్లపై వెళ్లే డ్రైవర్ లెస్ కార్లను చూసినప్పుడు మనకు ముందుగా గ్రాఫిక్ సినిమాలే గుర్తుకు వస్తాయి. కానీ, సినిమాల్లో డ్రైవర్ లేకుండా కారు ఎలా నడుస్తుందో అలాంటి స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ భారతీయుడు విదేశాల్లో డ్రైవర్‌లేని కారులో ప్రయాణించిన తర్వాత తన అనుభవాన్ని వివరిస్తున్నాడు. ఆ వీడియో వైరల్ గా మారి ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది…
వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన నేహా దీపక్ షా 2015లో మాస్టర్‌చెఫ్ ఇండియా సీజన్ 4లో పోటీదారుగా నటించారు. ప్రస్తుతం ఆమె కొద్ది రోజుల క్రితం అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలో ప్రయాణించిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు తనకు టార్జాన్ ది వండర్ గుర్తుకు వచ్చిందని ఆమె చెప్పింది. డ్రైవర్ లేకుండా ఆ కారు ఎలా నడిచిందో తను నెటిజన్లకు వివరిస్తూ వీడియో రిలీజ్ చేసింది. ఈ డ్రైవర్ లేని ప్రయాణంలో తను ఎంతో థ్రిల్ అనుభవించానని చెప్పింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ఇది తన మొదటి డ్రైవర్‌లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీ అని రాశారు. తన అనుభవాన్ని వివరిస్తూ.. ఈ ట్యాక్సీలో ప్రయాణిస్తుంటే తనకు భారతీయ సినిమా టార్జాన్ ది వండర్ గుర్తుకు వస్తుందని చెప్పారు. ఆమె ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని వివరించారు.
ఆమె షేర్ చేసిన ఈ వీడియో అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీని వీక్షణలు 14 మిలియన్లకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇది మహిళలకు అత్యంత సురక్షితమైనదని కొందరు అంటున్నారు. దీంతో ఉపాధికి ఇబ్బందులు తలెత్తుతాయని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి కార్లు ఇండియాకు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నామంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..