Dog Has Millions Of Followers In Instagram: సోషల్ మీడియా.. ఇప్పుడీ పేరు తెలియని సగటు వ్యక్తి లేరనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. స్కూలుకు వెళ్లే చిన్న పిల్లల నుంచి రిటైర్డ్ అయిన ముసలి వారి వరకు సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసేస్తున్నారు.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే అంతలా తమకు క్రేజ్ ఉందని భావిస్తోన్న రోజులివీ. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు తమ ఫాలోవర్ల సంఖ్యను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అయితే ఓ శునకానికి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉంటే ఎలా ఉంటుంది.? ‘ప్రతీ కుక్కకు ఓ రోజు’ వస్తుందన్న నానుడి ఈ శునకానికి 100 శాతం సెట్ అయ్యేలా ఉంది.
ఇంతకీ విషయమేంటంటే.. ఓ శునకం యజమాని తన పెట్ డాగ్‌కు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేశాడు. ‘మాయ పోలార్ బియర్’ ఐడీతో పోస్టులు పెట్టడం మొదలు పెట్టాడు. ఈ బుజ్జి కుక్క చేసే అల్లరి పనులు, దాని ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం ప్రారంభించాడు. దీంతో నెమ్మదిగా ఈ శునకానికి ఫాలోవర్లు పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ శునకానికి ఏకంగా సుమారు 20 లక్షల ఫాలోవర్లు అయ్యారు. దీంతో ఈ శునకం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏమంటూ దీనికి మాయ పోలార్ బియర్ అని పెట్టారో కానీ.. నిజంగానే నెటిజన్లను మాయ చేస్తోంది. ఇక ఈ శునకం కేవలం సోషల్ మీడియాలో ఫాలోవర్లనే కాకుండా పలు అవార్డులను కూడా గెలుచుకుంది.