ప్రపంచంలో 14 దేశాలతో సరిహద్దులు పంచుకునే ఏకైక దేశం.. ఏదో తెలుసా?

Sharing Border with 14 Nations: సాధారణంగా ఒక రాష్ట్రం, లేదా దేశం ఒకటి లేదా రెండు దేశాల సరిహద్దులను కలిగి ఉండడం మనం చూసి ఉంటాం. కానీ ఇక్కడో దేశం మాత్రం ఏకంగా ప్రపంచంలోని 14 దేశాల సరిహద్దులను పంచుకుంటుందంట. వినడానికి ఆశ్చర్యంగా అనిపించ వచ్చు. కానీ ఇది నిజం. ఇంతకు ఆ దేశం ఏది అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.

ప్రపంచంలో 14 దేశాలతో సరిహద్దులు పంచుకునే ఏకైక దేశం.. ఏదో తెలుసా?
Border

Updated on: Oct 21, 2025 | 8:38 PM

సాధారణంగా ఒక రాష్ట్రం, లేదా దేశం ఒకటి లేదా రెండు దేశాల సరిహద్దులను కలిగి ఉండడం మనం చూసి ఉంటాం. కానీ
ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద దేశమైన చైనా ఏకంగా 14 దేశాలతో సరిహద్దులను పంచుకుందింది. దీని సరిహద్దులు వేల కిలోమీటర్ల పర్వతాలు, ఎడారులు, అడవులు ,నదులలో విస్తరించి ఉన్నాయి. ఇది భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, వియత్నాం, కంబోడియా, ఉత్తర కొరియా, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, మంగోలియాలతో సరిహద్దులను పంచుకుంటుంది. ప్రపంచంలో మరే ఇతర దేశం కూడా ఇన్ని సరిహద్దులను పంచుకోదు.

సంస్కృతులు, భాషల సమ్మేళనం

చైనా అనేక దేశాలకు సరిహద్దుగా ఉండడం వల్ల ఇది సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలకు నిలయంగా మారింది.ఈ దేశానికి పశ్చిమాన మంచుతో కప్పబడిన హిమాలయాల నుండి వియత్నాం, మయన్మార్ అడవుల వరకు, సరిహద్దు ప్రాంతాలు విభిన్న జాతులకు నిలయంగా ఉన్నాయి.

భౌగోళిక వైవిధ్యం

చైనా సరిహద్దులు గోబీ ఎడారి, హిమాలయాల నుండి విస్తారమైన నదీ లోయలు, దట్టమైన అడవుల వరకు విభిన్న ప్రకృతి దృశ్యాల గుండా వెళతాయి. ఈ వైవిధ్యం చైనా వాతావరణం, జీవవైవిధ్యాన్ని అలాగే ఈ ప్రాంతాలలో నివసించే ప్రజల వాణిజ్యం, జీవనశైలిని ప్రభావితం చేస్తుంది.

అయితే 14 పొరుగు దేశాల సరిహద్దును కలిగి ఉంది కాబట్టి చైనా అన్ని దేశాలతో సంబంధాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇన్ని దేశాలతో సంబంధాల వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో… అనే సవాళ్లను కూడా చైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ వీటి ద్వారా చైనా గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తుంది. అనేక దేశాలకు పొరుగు దేశంగా, చైనా ప్రపంచ రాజకీయాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.