Traffic Rules: పేరెంట్స్‌ బీ అలర్ట్‌.. మీ పిల్లలకు బండి ఇస్తున్నారా.? జైల్లో కూర్చుంటారు జాగ్రత్త..

|

Jul 29, 2022 | 8:51 AM

Traffic Rules: పిల్లలు ప్రయోజకులు కావాలని ప్రతీ పేరెంట్‌ ఆరాటపడుతుంటారు. అందు కోసమే చిన్ననాటి నుంచి వారికి అన్ని విద్యా బుద్ధులు నేర్పిస్తుంటారు. చిన్న వయసులోనే అన్ని పనులు చేయాలని ఆరాపడుతుంటారు. అందులో భాగంగానే...

Traffic Rules: పేరెంట్స్‌ బీ అలర్ట్‌.. మీ పిల్లలకు బండి ఇస్తున్నారా.? జైల్లో కూర్చుంటారు జాగ్రత్త..
Follow us on

Traffic Rules: పిల్లలు ప్రయోజకులు కావాలని ప్రతీ పేరెంట్‌ ఆరాటపడుతుంటారు. అందు కోసమే చిన్ననాటి నుంచి వారికి అన్ని విద్యా బుద్ధులు నేర్పిస్తుంటారు. చిన్న వయసులోనే అన్ని పనులు చేయాలని ఆరాపడుతుంటారు. అందులో భాగంగానే వయసుతో సంబంధం లేకుండా కారు, బైక్‌ డ్రైవింగ్ నేర్పిస్తుంటారు. అంతటితో ఆగకుండా వారు వాహననం నడుపుతుంటే చూసి సంతోషిస్తుంటారు. అయితే పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమనే విషయం మీలో ఎంత మందికి తెలుసు.? మీ సరదా కోసమో, పిల్లల మాట కాదనలేకో వారికి వాహనం ఇచ్చారో పేరెంట్స్‌ జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకీ ఇండియన్‌ డ్రైవింగ్‌ లా ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం..

భారతదేశ చట్టాల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారే వాహనాన్ని నడపాలి. అలా కాకుండా 18 ఏళ్లలోపు వాహనాన్ని నడిపిస్తే, ఆ వాహన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసే హక్కు అధికారులకు ఉంటుంది. వాహనం నడిపిన చిన్నారి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు కూడా. ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీస్‌లో ఏసీపీగా పనిచేసిన హనుమంత్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండని కుర్రాడు వాహనం నడిపి ఎవరికైనా ప్రమాదం చేస్తే వాహనం ఎవరి పేరుపై రిజిస్టర్‌ అయి ఉందో చట్టం వారినే శిక్షిస్తుంది.

ఒక వ్యక్తి 18 ఏళ్లు నిండిన తర్వాతే డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొదట లెర్నింగ్ లైసెన్స్‌ ఇచ్చిన ఆరునెలలకు డ్రైవింగ్ పరీక్షలో అర్హత సాధిస్తేనే లైసెన్స్‌ ఇస్తారు. ఇదిలా ఉంటే ఒకవేళ 18 ఏళ్లలోపు వయసున్న వ్యక్తి నడుపుతోన్న వాహనం ప్రమాదానికి గురైతే.. భీమా కంపెనీలు మీ క్లెయిమ్‌ను అంగీకరించవు. మీరు సక్రమంగా ఇన్సూరెన్స్‌ చెల్లిస్తున్నా దానిని క్లెయిమ్‌ చేసుకోలేరని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..