
మూడో ప్రపంచం యుద్ధం మొదలైంది. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు ఇరాన్ కూడా.. ఆ రెండు దేశాలతో పాటు.. వాటికి దన్నుగా నిలిచిన గల్ఫ్ కంత్రీలపై బాంబులతో విరుచుకుపడుతోంది. ఇక ఇదిలా ఉంటే.. ఎన్ని అణుబాంబులు పడితే.. మన భూమిపై లైఫ్ అంతమైపోతుందో మీకు తెల్సా.! లెక్కలు చూస్తే షాక్ అవుతారు. భూమిపై వివిధ ప్రాంతాల్లో 100 అణుబాంబులు పడ్డాయని అనుకుందాం. ఫస్ట్ అవి పడిన ప్లేస్‌లలో కోట్లలో జనాలు చనిపోతారు.
అన్ని బాంబులు పడటం వల్ల పొగ ఎంత వస్తుందంటే..! సుమారు 10 అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు ఆ పొగ.. మన భూమిపై సూర్యరశ్మి పడకుండా ఆపేస్తుంది. ఇక సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు పడిపోతాయి. భూమి పూర్తిగా చల్లగా మారిపోయి.. మైనస్ డిగ్రీలకు చేరుకుంటుంది. దీనినే ‘న్యూక్లియర్ వింటర్’ అంటారు. ఇలాంటి వాతావరణంలో పంటలు పండవు. అణుబాంబుల వల్ల గాలి మొత్తం కలుషితం అయిపోతుంది. ఆ బ్రతికి ఉన్న కొంతమంది గాలి కాలుష్యం వల్ల, ఫుడ్ లేకపోవడం వల్ల ఆపై పదేళ్లలో చనిపోతారు. అలా భూమి మీద మనిషి అనేవాడు అంతమైపోతాడు. ఇదంతా కూడా జస్ట్ 100 అణుబాంబులు పడితే వచ్చే ఎఫెక్ట్.
రష్యా – 5459
అమెరికా – 5277
చైనా – 600
ఫ్రాన్స్ – 290
యూకే – 225
భారత్ – 180
పాకిస్తాన్ – 170
ఇజ్రాయిల్ – 91
నార్త్ కొరియా – 50
ఇలా మొత్తం ప్రపంచంలో 12,000 అణుబాంబులు ఉన్నాయి. 100 అణుబాంబులు పడితేనే భూమిపై లైఫ్ అనేది ఉండదు. అలాంటిది ఈ 12 వేల అణుబాంబులతో సగం సోలార్ సిస్టమ్ లేపెయొచ్చు. ఇదంతా చూస్తుంటే.. అన్ని జీవుల కంటే తెలివైన జీవులు మనుషులు అని అంటారు. కానీ ఆ మనిషే తన చావును తానే తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నట్టు లెక్క.!