Cry Me A Cockroach: వేలైంటెన్స్ డేన భగ్న ప్రేమికులకు జూ అధికారుల బంపర్ ఆఫర్.. మాజీల పేర్లు ఎలుకలు, బొద్దింకలకు పెట్టుకుని..

|

Jan 28, 2021 | 3:38 PM

ప్రేమికుల రోజు వచ్చిందంటే.. భగ్న ప్రేమికుల బాధ వర్ణాతీతం అటువంటి వారి కోసం అమెరికాలోని టెక్సాస్‌లోని శాన్‌ ఆంటానియో జూ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. జూలోని బొద్దింకలు, ఎలుకలకు తమ మాజీల పేర్లు పెట్టుకునే...

Cry Me A Cockroach: వేలైంటెన్స్ డేన భగ్న ప్రేమికులకు జూ అధికారుల బంపర్ ఆఫర్.. మాజీల పేర్లు ఎలుకలు, బొద్దింకలకు పెట్టుకుని..
Follow us on

Cry Me A Cockroach: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం బతకాలని ప్రేమికుల జంట కోరుకుంటారు.. అయితే కొన్ని కారణాలతో ప్రేమ విఫలమైతే.. ఆ వ్యక్తి ఆ బాధను మరచిపోవడం అంత ఈజీకాదు.. నిజంగా చెప్పాలంటే.. ప్రేమలో విఫలమైన వారు తన మనసుతో తానే యుద్ధం చేయాల్సి ఉంటుంది.. అలా యుద్ధం చేస్తూ.. తన ఆలోచనలను వేరే విషయాలపై పెట్టేలా చేసుకుని జీవితంలో ముందుకు కొనసాగాలి.. అయితే చాలా మంది భగ్న ప్రేమికులు తమ ప్రేమను.. తమ పార్ట్నర్ తో గడిపిన క్షణాలను.. మధుర స్మృతులను తల్చుకుంటూ.. తమలో తామే కుమిలిపోతూ ఉంటారు.. తాను ప్రస్తుతం గడుపుతున్న ప్రతి క్షణాన్ని.. గడిచిపోయిన సమయంతో పోల్చుకుంటూ. నిత్యం సంఘర్షణ పడుతుంటాడు. కొంతమంది అయితే తమ పెంపుడు జంతువుకు, చెట్లకు తమ ప్రేమికుల పేర్లు పెట్టుకుని కాలం గడిపేస్తుంటారు.. ముఖ్యంగా ప్రేమికుల రోజు వచ్చిందంటే.. వారి బాధ వర్ణాతీతం అటువంటి వారి కోసం అమెరికాలోని టెక్సాస్‌లోని శాన్‌ ఆంటానియో జూ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది.

14 ప్రేమికుల రోజున “క్రై మీ ఏ కాక్‌రూచ్‌” అనే ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జూలోని బొద్దింకలు, ఎలుకలకు తమ మాజీల పేర్లు పెట్టుకునే, ప్రేమికుల రోజున వాటితో వేరే జంతువుల కడుపునింపే మంచి అవకాశాన్ని జూ అధికారులు కల్పిస్తున్నారు. అయితే ఇలా చెయ్యాలంటే.. బొద్దింకకు రూ. 370, ఎలుకకు రూ.1800లు చెల్లించాల్సి ఉంటుంది. మనం బహుమతిగా ఇచ్చే వీటిని ఇతర జంతువులకు ఆహారంగా వేస్తారు. శాకాహార జంతువులకు శాకాహారం బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం రూ. 370 చెల్లించాల్సి ఉంటుందని జూ అధికారులు తెలిపారు. అంటే అమ్మరాజీనామ సినిమాలో సత్యనారాయణ తన ఆఫీసర్ మీద కోపం ప్రదర్శించడానికి కుక్కకు ఆఫీసర్ పేరు పెట్టుకుని తిట్టుకున్నట్లు అన్నమాట.. మరి ఈ ఆలోచన ఎంత మంది భగ్నప్రేమికుల బాధను తీరుస్తుందో చూడాలి మరి

Also Read: టీడీపీ ఎమ్మెల్యే క్వారీలు, గ్రానైట్ ఫ్యాక్టరీల్లో మైనింగ్ అధికారుల సోదాలు.. రాకీయకక్షే అంటున్న ప్రతిపక్షాలు