Guinness record: ప్రపంచంలోనే అతిపెద్ద జీన్స్‌ ప్యాంట్‌.. గిన్నిస్‌ బుక్‌లో చోటు..

|

Oct 20, 2024 | 11:51 AM

గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాలంటే ఏదైనా కొత్తగా చేయాలని తెలిసిందే. అలా రకరకాల వస్తువులను తయారు చేస్తూ, వినూత్న మార్గాల్లో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంటుంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ కంపెనీ ఇలాగే గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఆ కంపెనీ చేసి ఆ పనెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Guinness record: ప్రపంచంలోనే అతిపెద్ద జీన్స్‌ ప్యాంట్‌.. గిన్నిస్‌ బుక్‌లో చోటు..
Guinness Record
Follow us on

నలుగురు వెళ్లే దారికి భిన్నంగా వెళ్తేనే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తారు. ఇలాంటి వారిని గుర్తించి ఉన్నత స్థానం కల్పించేదే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌. అసాధారణ పనులకు ఒక చోట చేర్చి ప్రపంచానికి తెలిసేలా చేస్తారు. తాజాగా జీన్స్‌ ప్యాంట్‌తో ఇలాంటి అద్భుతాన్నే సృష్టించారు. చైనాకు చెందిన ఓ సంస్థ ప్రపంచంలోనే అత్యంత పొడవైన జీన్స్‌ ప్యాంట్‌ను తయారు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇంతకీ ఈ ప్యాంట్‌ను రూపొందించడానికి ఎన్ని రోజులు కష్టపడ్డారు.? ఎంత మంది పనిచేశార.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాలోని గ్వాంగ్జీ నగరానికి చెందిన ఓ జీన్స్‌ తయారీ సంస్థ ఈ జీన్స్‌ను తయారు చేసింది. దీనిని తయారు చేసేందుకు 30 మంది కళాకారులు, 18 రోజుల పాటు శ్రమించారు. ఈ జీన్స్‌ పొడవు ఏకంగా 76.34 మీటర్ కావడం విశేషం. ఈ ప్యాంట్ పొడవు పీసా టవర్‌ కంటే ఎక్కువ కావడం విశేషం. పీసా టవర్‌ పొడవు 55 మీటర్లు ఉంటుంది. ఈ ప్యాంట్‌ను 28 సెప్టెంబర్ 2024న వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ జీన్స్‌ వెస్ట్‌ పరిమాణం 58.164 మీటర్లుగా ఉంది.

ఇదిలా ఉంటే చైనా కంటే ముందు ప్రపంచంలోనే అత్యంత పొడవైన జీన్స్‌ను ప్యారిస్‌లో తయారు చేశారు. ఈ జీన్స్‌ పొడవు 65.60 మీటర్లుగా ఉండేది. అయితే తాజాగా చైనాలో రూపొందించిన ప్యాంట్ 11 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. ఈ జీన్స్‌ను తయారు చేయడానికి 18 రోజులు పట్టింది. ఇందుకోసం 30 మంది కూలీలు రేయింబవళ్లు కష్టపడి పనిచేశారు.

ఈ జీన్స్‌పై కేవలం ఒక్క బటన్‌ బరువే ఏకంగా 3.6 టన్నులు కావడం విశేషం. ఇక ప్యాంట్ బరువు ఏకంగా 3600 కిలోలుగా ఉంది. ఈ ప్యాంట్‌కు 7.8 మీటర్ల పొడవైన జిప్పర్‌ను అందించారు. ఈ జిప్పర్‌ను స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేశారు. దీంతో ఈ జిప్పర్‌ ఎప్పటికీ తుప్పు పట్టదు. ప్రస్తుతం ఈ జీన్స్‌ ప్యాంట్‌కు సంబంధించి నెట్టింట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..