Children orphaned : కరోనా మహమ్మారి అనేక కుటుంబాలను, అనేక మంది అభాగ్యుల జీవితాలను తల్లకిందులు చేస్తోంది. కుటుంబ పెద్ద మరణంతో ఎన్నో కుటుంబాలు వీధిపాలౌతున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ కరోనాకు బలైపోతే వాళ్ల పిల్లలు అనాధలుగా మిగులుతున్నారు. చదువులు, బతుకు భరోసా లేక దిక్కుతోచని స్థితిలో చిన్నారుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ దిక్కులేని కుటుంబాలలో ఆడపిల్లల భద్రత మరింత ప్రశ్నార్ధకంగా ఉంది. ఏ కుటుంబంలోనైనా పిల్లలకు తల్లిదండ్రులే కొండంత అండ. పేదలైనా, ధనికులైనా సరే, అమ్మా నాన్న పక్కనుంటే ఆ ధీమా వేరు. పెరిగి పెద్దయ్యి కనీసం జీవితంలో స్థిరపడే వరకూ ఎవరికైనా తల్లిదండ్రుల ఆసరా ఉండాల్సిందే. కానీ కనికరం లేని కరోనా అనేక కుటుంబాల్లో పెద్దలను బలిగొంటుండటంతో దీన స్థితిలో బాలలు తల్లడిల్లిపోతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన విషాదంలో ఉన్న పిల్లలపై కొన్ని కుటుంబాలలో ఇంట్లోని వృద్దుల పోషణ భారం పడుతోంది. చిన్నపిల్లలను మానవత్వంతో కొంతమంది చేరదీస్తుండగా, యుక్త వయస్సు పిల్లల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. కరోనాతో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాల, పిల్లల దీనగాథలు.. విషాదకర ఉదంతాలు తెలుగురాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.
Read also : Low pressure : తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం.. రేపటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం