Watch Video: చేపల కోసం వెళ్తే.. వలలో చిక్కిన 22 ఏళ్ల నాటి బాక్స్.. ఓపెన్ చేసి చూస్తే ఫ్యూజులు ఔట్..

|

Apr 24, 2022 | 3:53 PM

అకస్మాత్తుగా కొందరికి భారీ నగదు దొరకడం అప్పుడప్పుడూ వింటూనే ఉన్నాం. కొన్ని చూసే ఉంటాం. ఇలాంటివి జరిగినప్పుడు అంతా ఆశ్చర్యపోతుంటారు. అయితే, 15 ఏళ్ల బాలుడి విషయంలోనూ అచ్చం ఇలాంటి సీన్ జరిగింది. కానీ..

Watch Video: చేపల కోసం వెళ్తే.. వలలో చిక్కిన 22 ఏళ్ల నాటి బాక్స్.. ఓపెన్ చేసి చూస్తే ఫ్యూజులు ఔట్..
Boy Found Box Full With Cash
Follow us on

నదిలో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడికి ఓ ‘నిధి’ లభించింది. అయితే, అంత డబ్బు దొరకడంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అయితే, దురాశ చూపకుండా.. దానిని నిజమైన యజమానికి తిరిగి ఇచ్చాడు. ఈ ‘అన్‌క్లెయిమ్‌డ్‌’ ఖజానాను అసలు యజమానికి తిరిగి ఇవ్వడంతో యువకుడి నిజాయితీని ప్రజలు కొనియాడుతున్నారు.  అయితే, ఈ నిధి 22 సంవత్సరాల క్రితం కావడం విశేషం. అందుకే ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ కేసు ఇంగ్లాండ్‌లో జరిగింది. 15 ఏళ్ల జార్జ్ టిండేల్ తన 52 ఏళ్ల తండ్రి కెవిన్‌తో కలిసి వితం నదిలో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఫిషింగ్ సమయంలో నదిలో అయస్కాంతాన్ని ఉంచడం ద్వారా వారు లోపల నుంచి ఎన్నో వస్తువులను బయటకు తీశారు. అందులోనే ఖజానా ఉన్న బాక్స్ దొరికింది.

‘డైలీ స్టార్’ నివేదిక ప్రకారం, జార్జ్ అయస్కాంతాన్ని నదిలో విసిరిన వెంటనే, దానికి ఒక బాక్స్ అంటుకుంది. జార్జ్ ఆ బాక్స్ని నీటి నుంచి బయటకు తీసినప్పుడు, అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సేఫ్ నిండా నగదు ఉంది. ఆ డబ్బును లెక్కించగానే అందులో లక్షా ముప్పై వేలకు పైగా డాలర్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఇందులో లభించిన కార్డులను చెక్ చేసిన చూడగా, రాబ్ ఎవరెట్ అనే వ్యాపారవేత్తకు చెందినదిగా గుర్తించారు.

ఇది తెలుసుకున్న జార్జ్, అతని తండ్రి కెవిన్ డబ్బును తమ వద్ద ఉంచుకోకుండా దాని నిజమైన యజమానికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు రాబ్ ఎవరెట్‌ను సంప్రదించారు. 2000 సంవత్సరంలో అతని కార్యాలయంలో దొంగతనం జరిగిందని, అక్కడ నుంచి ఈ సేఫ్ మాయమైందని తెలిపాడు. 22 ఏళ్ల తర్వాత తన డబ్బుతోపాటు వస్తువులను అందుకున్న తర్వాత రాబ్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతను జార్జ్, కెవిన్ నిజాయితీని మెచ్చుకున్నాడు. వారి నిజాయితీకి మెచ్చుకుని వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. 22 ఏళ్ల క్రితం ఇలా దొంగిలించిన వస్తువులు లభించడం ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తాయనడంలో సందేహం లేదు. ఇన్నేళ్లుగా ఎవరూ ఈ బాక్స్‌ని ఎవరూ చూడకపోవడం విశేషం.

Also Read: RD Interest Rates: బ్యాంక్, పోస్ట్ ఆఫీస్‌ ఆర్‌డీల్లో ఏది బెస్ట్.. అధిక లాభం ఎక్కడ వస్తుందో తెలుసా?

AP: వీరి ఇంగ్లీష్ వింటే మంచు లక్ష్మి మురిసిపోవడం ఖాయం.. అదరగొడుతున్న బెండపూడి అమ్మాయిలు