Creepy TikTok Ghost Video: మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూశారా.? పోనీ చూడాలని అనుకున్నారా.? అసలు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా.? అవి ఉన్నాయన్నది ఎంతవరకు నిజం అని అనుకుంటున్నారు.? ఇలా చాలా ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు లేవు. దెయ్యాల(Ghosts)పై చాలామంది పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది అవి ఉన్నాయని ఆధారాలు, ఫోటోలు, వీడియోలు చూపిస్తుంటారు. అయితే అసలు దెయ్యాలన్నవి లేవని అవన్నీ వట్టి బూటకం అని మరికొందరు ఆ మాటలను కొట్టిపారేస్తుంటారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా రోజురోజుకూ అభివృద్ధి చెందుతుండగా ఇలాంటి దెయ్యాల కథలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.! ఇటీవల నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పాప మంచంపై ఆటబొమ్మలతో ఆడుకుంటుంటే.. అకస్మాత్తుగా ఎవరో ఆ చిన్నారిని మంచం కిందకు లాగేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. (Creepy TikTok Ghost Video)
ఆ వైరల్ వీడియో ప్రకారం.. ఓ పాప తన మంచంపై బొమ్మలతో ఆడుకుంటున్నట్లు స్పష్టంగా అందులో చూడవచ్చు. కొద్దిసేపటికి తన ఆట బొమ్మను వెతికేందుకు ఆ చిన్నారి మంచం దిగుతుంది. అప్పుడే అకస్మాత్తుగా ఎవరో ఆ చిన్నారిని మంచం క్రింద లాగడం జరుగుతుంది. క్రమంగా, చిన్నారి పూర్తిగా మంచం క్రింద వెళ్ళిపోతుంది. ఈ వీడియో చూసిన చాలామంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ చిన్నారి తండ్రి జాస్ డీన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇప్పుడు ఈ వీడియోనే హాట్ టాపిక్. దీని గురించి చాలామంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వారు అనేకసార్లు రివైండ్ చేసి మరీ చూస్తున్నారు. కొంతమంది అక్కడ ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీ(Paranormal Activity) జరగలేదని చెబుతున్నారు. మరికొందరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ చిన్నారి తండ్రి మాత్రం.. ఆమె తనంతట తానుగా మంచం కిందకు వెళ్లలేదని.. వాస్తవానికి ఎవరో ఆమెను లాగారని వీడియోలో పేర్కొన్నాడు. (Horrifying Tik Tok Video)
వీడియోను తీక్షణంగా చూస్తుంటే.. మంచం కిందకు పాపను లాగుతున్నప్పుడు ఆమె అరుపులు, ఏడుపు వినిపిస్తాయి. ఎవరో ఆమెను మంచం కిందకి లాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఘటన మొత్తం ఆ రూమ్ సీసీటీవీ కెమెరాకు చిక్కగా.. సామాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించి రెండు వీడియోలను షేర్ చేశారు. అవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ వీడియోను చూసిన చాలామంది నెటిజన్లేలు షాక్ అవుతున్నారు. నిజంగానే దెయ్యం ఆ పాపను మంచం కిందకు లాగిందా.? లేదా అంతా భ్రమేనా అని డౌట్ పడుతున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!
హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!
Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్ చేసిన రియల్ హీరో.. చివరికి ఏమైందంటే.!
ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?