మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకున్నారా? అయితే వెంటనే చేసుకోండి. లేకపోతే భారీగా జినామా కట్టాల్సి వస్తుంది. గతంలో ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ అనుసంధానం చేయకపోతే వినియోగదారుడి పాన్ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే 2 నిమిషాల్లో ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు. అది ఏలా అంటే.. మీ ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టిన తేదీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత తొలి పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి. ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి. దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.