హోటల్స్‌కి ఎందుకు వెళ్తాం.? మంచి భోజనం కోసమేనని చెప్తారు కదూ! అయితే జపాన్‌లోని ఓ రెస్టారెంట్ మాత్రం భోజనంతో పాటు రెండు చెంపలు వాయించే సేవలను అందిస్తోంది. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అనడానికి ఇదే నిదర్శనం. జనాలు కూడా డబ్బులు ఇచ్చి మరీ చెంపలు వాయించుకుంటున్నారు. రెస్టారెంట్‌లో చెంపలు వాయించడం ఏంటి.? డబ్బులు చెల్లించి మరీ కొట్టించుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
జపాన్‌లోని నగోయా నగరంలో.. సాచిహోకో-యా ఇకజయా అనే రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్‌లో టిఫిన్స్, మీల్స్‌తో పాటు ప్రత్యేక సేవలు సైతం అందిస్తున్నారు. అదే చెంప దెబ్బలు. అవునండి.. కస్టమర్లు డబ్బులు చెల్లించి మరీ చెంప దెబ్బలు తింటున్నారు. అందమైన అమ్మాయిలు వరుసలో నిలబడి మరీ చెంప చెల్లుమనిస్తారు. ఇందుకోసం 300 యెన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. సుమారు రూ. 170 చెల్లించాలి.
చెంపదెబ్బలు తినడానికి ఎవరు ఇష్టపడతారు, అది కూడా డబ్బులిచ్చి మరీ అని ఆలోచిస్తున్నారు కదూ! కానీ జపాన్‌లోని ఈ రెస్టారెంట్‌కు మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అసలు ఇలా చెంపలు వాయించుకుంటే ఏం వస్తుందనేగా.. దీని ద్వారా తమ ఒత్తిడి దూరమవుతుందని ఇక్కడికి వస్తున్న వారు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ వీడియోలు కాస్త వైరల్ కావడంతో స్థానికంగా ఉన్న అధికారులు స్పందించారు. సదరు రెస్టారెంట్‌ను ఈ సేవలను నిలిపివేయాలని హెచ్చరించారు. పొరపాటున సున్నితంగా ఉండే చెవి ప్రాంతంలో దెబ్బ తగిలితే ప్రాణాలకే ప్రమాదం ఉంటుందన్న కారణంతో ఇలాంటి వాటిని మానుకోవాలని గట్టిగానే హెచ్చరించారంటా. దీంతో సదరు రెస్టారెంట్ ఈ సేవలను ఇటీవల ఆపేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఈ వెరైటీ రెస్టారెంట్ హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..