Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు మెడికల్‌ కాలేజీలో కరోనా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

కోల్కతా కాళీ అలంకరణకు భారీ బడ్జెట్.. !

Huge budget allotted for Kali Mata decoration in Kolkata, కోల్కతా కాళీ అలంకరణకు భారీ బడ్జెట్.. !

ఓ పక్క దేశమంతా.. ఆర్థిక మాంద్యంతో మందగిస్తుంటే.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వాసులు మాత్రం దుర్గామాతా అలంకరణల కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో కోల్‌కతాలోని పూజా కమిటీలు ఈ ఉత్సవాల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నాయి.

దుర్గా నవరాత్రుల్ని ఆ రాష్ట్రంలో ఘనంగా జరుపనున్న నేపథ్యంలో కోల్‌కతాలోని బౌబజార్‌కు చెందిన ‘ సంతోష్ మిత్రా స్క్వేర్ ’ దుర్గా పూజ నిర్వాహకులు దుర్గా దేవిని, ఆమె సింహం మరియు మహిషాసురలను అలంకరించడానికి ఏకంగా 50 కిలోల బంగారాన్ని ఉపయోగించారు. బంగారం ధర రూ.40,000 లకు వరకూ ఉన్న క్రమంలో ఈ బంగారు అలంకరణ ఖరీదు సుమారు రూ.20 కోట్ల వరకూ ఉంది.

ఈ సంవత్సరం అత్యంత ఖరీదైన విగ్రహం ఇదేనని పూజా కమిటీ ప్రధాన శిల్పి తెలిపారు. 2017 దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఈ పూజా కమిటీ అమ్మవారిని బంగారు చీరతో అలంకరించింది. ఫ్యాషన్ డిజైనర్ అగ్నిమిత్ర పాల్ రూపొందించిన ఈ బంగారు చీర ధర లక్షల పైచిలుకే.

గత కొన్నేళ్లుగా వివిధ పూజ కమిటీలు దేవతను అలంకరించడానికి విలువైన లోహాలను, రాళ్లను ఉపయోగిస్తున్నాయి. దుర్గాదేవి విగ్రహాలను అలంకరించడానికి ఉపయోగించే విలువైన లోహాలు మరియు రాళ్ళు పవిత్రమైనవిగా భావిస్తారు. అమ్మవారికి అలంకరించిన చీరలను వివాహాల్లో, శుభకార్యాల్లో వినియోగిస్తారు. దాని వల్ల శుభం జరుగుతుందని వారి నమ్మకం.

Related Tags