“హౌదీ మోదీ”లో.. పాక్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసిన మోదీ..!

హ్యూస్టన్ వేదికగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రధాని మోడీ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే.. దేశాభివృద్ధికి మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాదు పేదరిక నిర్మూలనలో మోదీ సాధించిన విజయాలను ట్రంప్ గుర్తుచేశారు. ప్రధానితో వ్యక్తిగత సంబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. అమెరికాకు దక్కిన అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా మోదీని అభివర్ణించారు. ఇక హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ 9/11 ఉగ్రవాదులు, 26/11 ముంబై ఉగ్రదాడుల […]

హౌదీ మోదీలో.. పాక్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసిన మోదీ..!
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 9:58 AM

హ్యూస్టన్ వేదికగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రధాని మోడీ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే.. దేశాభివృద్ధికి మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాదు పేదరిక నిర్మూలనలో మోదీ సాధించిన విజయాలను ట్రంప్ గుర్తుచేశారు. ప్రధానితో వ్యక్తిగత సంబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. అమెరికాకు దక్కిన అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా మోదీని అభివర్ణించారు. ఇక హౌడీ మోదీ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ 9/11 ఉగ్రవాదులు, 26/11 ముంబై ఉగ్రదాడుల మూలం ఒక్కటేనని ఆయన గుర్తుచేశారు. కాగా, ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు ట్రంప్ సహాయసహకారాలు అందిస్తాను అన్నారని, వారికి ధన్యవాదాలు అని మోదీ తెలిపారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకాశ్మీర్ లో దుర్వినియోగానికి గురైందని, అందుకే రద్దు చేశామని మోదీ అన్నారు. అలాగే ఉగ్రమూలాలు ఏదేశంలో ఉన్నాయో ప్రపంచానికి తెలుసంటూ పరోక్షంగా పాకిస్థాన్‌కు చురకలు అంటించారు. ఇక, ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. తనకు అపూర్వ స్వాగతం లభించిందని చెప్పారు.