COVID-19 కరోనా ఎలా చంపుతుందో తెలుసా? స్టెప్ బై స్టెప్

తెలుగు రాష్ట్రాలలో కరోనా రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. అయితే.. కరోనా గురించి వినడం ప్రారంభమై నెల రోజులు దాటిపోతున్నా.. అసలీ కరోనా మనిషికి ఎలా సోకుతుంది? సోకిన తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతుంది? చివరికి ఎలా మనిషిని అంతమొందిస్తుంది? ఈ అంశాలు మాత్రం చాలా మందికి ఇప్పటికీ తెలియదు.

COVID-19 కరోనా ఎలా చంపుతుందో తెలుసా?  స్టెప్ బై స్టెప్
Follow us

|

Updated on: Apr 26, 2020 | 12:10 AM

కరోనా.. కరోనా..కరోనా.. ఎక్కడ చూసినా కరోనా వార్తలే.. ఎక్కడ విన్నా కరోనా సంగతులే… ఎటు వెళదామన్నా కరోనా భయమే.. గత నెల రోజులుగా దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కరోనా రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. అయితే.. కరోనా గురించి వినడం ప్రారంభమై నెల రోజులు దాటిపోతున్నా.. అసలీ కరోనా మనిషికి ఎలా సోకుతుంది? సోకిన తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతుంది? చివరికి ఎలా మనిషిని అంతమొందిస్తుంది? ఈ అంశాలు మాత్రం చాలా మందికి ఇప్పటికీ తెలియదు.

కరోనా వైరస్ చేతుల ద్వారా నోరు, ముక్కు గుండా గొంతులోకి ప్రవేశించి, మెల్లిగా ఊపిరితిత్తులకు విస్తరించి.. ఆ తర్వాత తన తడాఖా చూపి మనిషిని మృత్యుముఖంలోకి చేరుస్తుందని అంతో ఇంతో టీవీ9 తెలుగు tv9telugu.com వంటి వెబ్ సైట్లను ఫాలో అవుతున్న వారికి తెలుసు. కానీ.. కరోనా ప్రభావం ఎలా, ఏ మేరకు శరీర అవయవాలపై ప్రభావం చూపుతుందన్న విషయం మాత్రం కూలంకషంగా ఎవరికీ తెలియని పరిస్థితి. కరోనాపై అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వాలు సైతం వైరస్ బారిన పడకుండా ఎలా వుండాలన్న అంశాన్నే ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. కానీ సోకితే.. దాని ప్రభావం ఎలా వుంటుందని, ఎలా మనిషిని చావుకు దగ్గర చేస్తుందనే విషయంలో పెద్దగా ప్రచారం జరగడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా శరీరంపై చూపే ప్రభావాన్ని కొన్ని మేగజైన్లలో చూసి మీకందిస్తోంది టీవీ9 తెలుగు వెబ్ సైట్.

మనిషి ఆయువు తీసేసే కరోనా వైరస్ శరీరంలో తిష్టవేసి క్రమంగా అన్ని అవయవాలపై ప్రభావం చూపుతోందని సైన్సు మేగజైన్లు పేర్కొంటున్నాయి. ఊపిరితిత్తులే కాదు..కళ్లు, గొంతు, గుండె, లివర్, కిడ్నీ, మెదడును లక్ష్యంగా చేసుకుని మనిషిని చంపేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లండన్ నగరంలో పలువురు రోగుల లక్షణాలను పరిశీలించిన తర్వాత వైద్య నిపుణులు ఈ అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఎటువంటి లక్షణాలు బయటపడని రోగులతోపాటు, వ్యాధి తగ్గిందనుకునేలోపే తిరగబెడుతున్న రోగుల్లోనూ ఈ వైరస్‌ అలజడి సృష్టిస్తోందని హెచ్చరించారు.

కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించడానికి అత్యంత అనుకూలమైన మార్గం ముక్కు. మొదట ఇది నాసికా రంధ్రాల్లో తిష్ఠవేస్తుంది. ఆ సమయంలో వాసన చూడటంలో రోగి సమస్యలను ఎదుర్కొంటాడు. వైరస్‌ ఆ తర్వాత మెల్లగా ముక్కు నుంచి గొంతులోకి చేరుతుంది. గొంతులోని మృదు చర్మంలో ఈ క్రిమి నిలిచేందుకు అవసరమైన ACE-2 సమృద్ధిగా ఉంటుంది. వైరస్‌కు ఉండే స్పైక్‌ ప్రొటీన్‌ ఆసరాగా అక్కడ కణాల్లో చొరబడి మరిన్ని వైరస్‌లను పునరుత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడకపోయినా.. చుట్టుపక్కల వారికి విపరీతంగా అంటించడంలో ఇది కీలకమైన దశ.

వైరస్‌ గొంతులోకి ప్రవేశించిన తొలి దశలో మన రోగ నిరోధక కణాలు స్పందించకుంటే గాలి గొట్టం నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తుల్లోకి చేరగానే వైరస్‌ విజృంభిస్తుంది. అక్కడ లక్షల సంఖ్యలో ఉండే శ్వాసకోశాలను ఆక్రమిస్తుంది. ఈ క్రమంలో ‘న్యుమోనైటిస్‌’ అనే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఊపిరితిత్తుల కండరాల్లో వాపు కనిపిస్తుంది. రోగి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు. అదేసమయంలో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి భారంగా మారుతుంది. కొందరు రోగుల్లో ‘అక్యూట్‌ రెస్పిరేటరి డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌’ కనిపిస్తుంది. అప్పుడు రక్తంలో ప్రాణవాయువు ప్రమాదకర స్థాయికి తగ్గిపోతుంది. ఈ దశలో వెంటిలేటర్లు వాడి రోగి ప్రాణాలను కాపాడొచ్చు.

కానీ కరోనా వైరస్‌ వ్యాప్తిని మాత్రం ఆపలేం. బాధితుడిలోని వ్యాధి నిరోధక కణాలు బలపడి వైరస్‌ను ఎదుర్కొనే వరకు వేచి ఉండాల్సిందే. ఈ దశలో చాలా మంది రోగుల్లో శరీరం అతిగా స్పందించడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగ నిరోధక కణాలు అదుపుతప్పి శరీర భాగాలపై కూడా దాడిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దశలో శరీరం మొత్తం వాపు ప్రక్రియ పెరిగిపోయి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. రక్తనాళాల్లో వాపు వస్తుంది. దీంతో 20 శాతం రోగుల్లో కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఇది గుండె సమస్యలకు సైతం కారణం అవుతోందని భావిస్తున్నారు.

కరోనా వైరస్ శరీరంలోని రక్తనాళాల గోడలపై దాడి చేసి వాపును సృష్టిస్తోంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తోంది. చైనాలోని వుహాన్‌లో 416 మంది కరోనా బాధితులపై నిర్వహించిన పరిశోధనలో 20 శాతం మంది గుండె సమస్యలతో మరణించినట్లు వైద్య నిపుణులు తెలిపారు. కొవిడ్‌ తీవ్ర స్థాయిలో ఉన్న రోగుల్లో రక్తనాళాల్లో వాపు ఎక్కువగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. అందుకే మధుమేహం, గుండెజబ్బులు ఉన్న వారికి ఇది ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు.

వైరస్‌ ముదిరిపోయి ఆసుపత్రిలో చేరిన రోగుల కాలేయాల్లో ఎంజైమ్‌ల శాతం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఫలితంగా కాలేయం పనితీరు దెబ్బతింటోంది. ఈ పరిస్థితికి కారణం రోగి వాడే ఔషధాలా? లేక వ్యాధి నిరోధక శక్తి అతిగా స్పందించడమా..? అనే దాన్ని తెలుసుకోవడానికి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కొవిడ్‌ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్న 85 మందిపై వుహాన్‌లో చేసిన పరిశోధనలో 27% రోగుల మూత్రపిండాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. కిడ్నీల్లో వైరస్‌కు అనుకూల రిసెప్టర్లు ఎక్కువగా ఉండటంతో నేరుగా దాడి చేస్తోందా? లేక రక్తపోటు పెరగడం వంటి లక్షణాల కారణంగా దెబ్బతింటున్నాయా? ఇంకా తేలాల్సి ఉంది.

మరోవైపు జపాన్‌లోని ఒక రోగిలో మెదడు వాపు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి మెదడులోని ద్రవాల్లోనూ వైరస్‌ను గుర్తించారు. దీంతో కరోనా వైరస్‌ కేంద్రనాడీ వ్యవస్థలోకి సైతం చొచ్చుకు పోగలదని అనుమానిస్తున్నారు. దీంతోపాటు మూర్ఛ, తలనొప్పి వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలతో పాటు అది మనిషిలో ఎలా విస్తరిస్తుంది అనే విషయంలో కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో