అంచెలంచెలుగా ఎదిగిన సీసీడే ఫౌండర్

కేఫ్ కాఫీ డే ఓనర్, ఫౌండర్ కూడా అయిన వి.జి.సిధ్ధార్థ..బిజినెస్ లో అంచెలంచెలుగా ఎదిగారు. (కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ అల్లుడైన సిధ్ధార్థ అదృశ్యం మిస్టరీగా మారింది). ఆయన కెరీర్ లోకి ఒక్కసారి తొంగి చూస్తే.. కర్ణాటకలోని చిక్ మగళూరులో పుట్టిన సిధ్ధార్థ కాఫీ తోటల బిజినెస్ కుటుంబం లోనుంచి వచ్చారు. దేశంలోని అతి పెద్ద కాఫీ ‘ సామ్రాజ్యాన్ని ‘ సృష్టించిన బిజినెస్ మన్ గా అవతరించారు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ […]

అంచెలంచెలుగా ఎదిగిన సీసీడే ఫౌండర్
Follow us

|

Updated on: Jul 30, 2019 | 3:53 PM

కేఫ్ కాఫీ డే ఓనర్, ఫౌండర్ కూడా అయిన వి.జి.సిధ్ధార్థ..బిజినెస్ లో అంచెలంచెలుగా ఎదిగారు. (కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ అల్లుడైన సిధ్ధార్థ అదృశ్యం మిస్టరీగా మారింది). ఆయన కెరీర్ లోకి ఒక్కసారి తొంగి చూస్తే.. కర్ణాటకలోని చిక్ మగళూరులో పుట్టిన సిధ్ధార్థ కాఫీ తోటల బిజినెస్ కుటుంబం లోనుంచి వచ్చారు. దేశంలోని అతి పెద్ద కాఫీ ‘ సామ్రాజ్యాన్ని ‘ సృష్టించిన బిజినెస్ మన్ గా అవతరించారు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ సాధించిన ఆయన తన పాతికేళ్ల వయస్సులోనే స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టారు. 1983-84 లో జె.ఎం. ఫైనాన్షియల్ లిమిటెడ్ లో పోర్ట్ ఫోలియో మేనేజ్ మెంట్ లో ట్రెయినీ/ఇంటర్న్ గా ఆయన చేరారు. వైస్ చైర్మన్ మహేంద్ర కంపానీ సారథ్యంలోని ఈ సంస్థలో ఉన్నప్పుడు ఈయన వయస్సు 24 ఏళ్ళు మాత్రమే. ఈ సంస్థలో రెండేళ్లు శిక్షణ పొందిన అనంతరం తిరిగి బెంగుళూరుకు చేరుకున్నారు. అప్పుడు నీకు నచ్చిన బిజినెస్ చేసుకోమంటూ సిధ్ధార్థ తండ్రి 30 వేల రూపాయలిచ్చారట. శివన్ సెక్యూరిటీస్ అనే కంపెనీ బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారట. దీన్నే 2000 సంవత్సరంలో ‘ వే 2 వెల్త్ సెక్యూరిటీస్ లిమిటెడ్ గా’ మార్చారు. దీని వెంచర్ కేపిటల్ డివిజన్ ని ఆ తరువాత ‘ గ్లోబల్ టెక్నాలజీ వెంచర్స్ ‘ గా మార్చారు. 1985 లో సిధ్ధార్థ స్టాక్ మార్కెట్లో పూర్తి స్థాయి ప్రొప్రయిటరీ ఇన్వెస్టర్ అయ్యారు. అప్పుడే 10 వేల కాఫీ తోటల యజమాని అయ్యారు. 1990 ప్రాంతంలో ఒక ఏడాదిలోగా తన పెట్టుబడులకు రెట్టింపు మొత్తాన్ని పొందారు. ఆ తరువాత 1993 లో సిధ్ధార్థ ఆధ్వర్యంలోని అమాల్గమేటెడ్ కాఫీ ట్రేడింగ్ కంపెనీ కాఫీ ఎగుమతులపై దృష్టి సారించింది. ఇండియాలో అతి పెద్ద కాఫీ ఎగుమతిదారు అయింది. 1996 లో బెంగుళూరులోని జనసమ్మర్థం గల బ్రిగేడ్ రోడ్ లో సిధ్ధార్థ తొలి సీ సీ డీ స్టోర్ ప్రారంభమైంది. ఇక్కడినుంచే కాఫీ చైన్ స్టోర్స్ లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం సీసీడీకి 1700 హోటల్స్ ఉన్నాయి. మనీ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం.. కాఫీ డే ఎంటర్ ప్రయిజెస్ వార్షిక టర్నోవర్ రూ. 4,264 కోట్లు. 2015 లో ఫోర్బ్స్ జాబితాలో ఈయన సంపద రూ. 8,200 కోట్లు ఉన్నట్టు తేలింది. 2002-03 లో సిధ్ధార్థ ఉత్తమ పారిశ్రామిక వేత్త అవార్డు అందుకున్నారు. అయితే 2017 నాటికి సీన్ మారింది. పన్నులు ఎగగొట్టారన్న ఆరోపణలు ఈయనపై వచ్చాయి. బెంగుళూరు, ముంబై, చెన్నై, చిక్ మగళూరులలోని సిధ్ధార్థ కార్యాలయాలపై ఆదాయం పన్ను అధికారులు దాడులు చేశారు. సీసీడీ రిటెయిల్ చైన్ లో రూ. 650 కోట్లను దాచినట్టు తెలిపే డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్