26 కోట్ల రూపాయలతో శ్మశానవాటిక

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దక్షిణ కైలాస ముక్తిధామంగా హిందూ శ్మశానవాటిక నిర్మిస్తున్నారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న బర్నింగ్‌ ప్లాంట్‌కి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. 12 ఎకరాల విస్తీర్ణంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు దశల్లో ఈ శ్మశానవాటిక నిర్మిస్తున్నారు.

  • Sanjay Kasula
  • Publish Date - 11:05 pm, Mon, 26 October 20

Hindu Cemetery is Being  :  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో దక్షిణ కైలాస ముక్తిధామంగా హిందూ శ్మశానవాటిక నిర్మిస్తున్నారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న బర్నింగ్‌ ప్లాంట్‌కి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. 12 ఎకరాల విస్తీర్ణంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు దశల్లో ఈ శ్మశానవాటిక నిర్మిస్తున్నారు.

హిందూ శ్మశానవాటిక అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ ఒక ఇటుకను తీసుకొచ్చి ఈ నిర్మాణంలో పాలుపంచుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనవంతుగా ఆయన కోటి రూపాయల విరాళం ప్రకటించారు.