‘రాధే…రాధే…ఐ యామ్ ఫైన్’… హేమమాలిని

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్ఛన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కరోనా వైరస్ కి గురై ఆసుపత్రిలో చేరడంతో.. ప్రముఖ నటి, పొలిటీషియన్ కూడా అయిన హేమమాలిని సైతం అనారోగ్యం బారిన పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాను..

  • Umakanth Rao
  • Publish Date - 10:05 am, Mon, 13 July 20

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్ఛన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్ఛన్ కరోనా వైరస్ కి గురై ఆసుపత్రిలో చేరడంతో.. ప్రముఖ నటి, పొలిటీషియన్ కూడా అయిన హేమమాలిని సైతం అనారోగ్యం బారిన పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తనకు ఏమీ కాలేదని ఆమె స్పష్టం చేశారు. మీ అభిమానం. ఆ శ్రీకృష్ణుని దయ వల్ల తనకు ఏ అనారోగ్యామూ లేదని ఆమె తన అభిమానులను ఉద్దేశించి …ట్విటర్ లో పోస్ట్ చేసిన వీడియోలో తెలిపారు. అంతకు ముందు ఆమె కుమార్తె ఈషా డియోల్ కూడా ట్విట్టర్లో తన తల్లి పూర్తి హెల్దీగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా… అమితాబ్ కుటుంబంలో ఆయన కోడలు ఐశ్వర్యా రాయ్, ఆమె  కుమార్తె కూడా కరోనా పాజిటివ్ కి గురయ్యారు. ప్రస్తుతం వారు హోం ఐసోలేషన్ లో ఉన్నారు.