తుఫాన్ హెచ్చరిక..ఏపీలో హై అలర్ట్.. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..

వాయుగుండం అల్పపీడనంగా మారింది. కోస్తాంధ్రపై ఈ అల్పపీడనం ఆవరించి ఉంది. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు

  • Sanjay Kasula
  • Publish Date - 3:59 pm, Fri, 27 November 20
తుఫాన్ హెచ్చరిక..ఏపీలో హై అలర్ట్.. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..

Heavy Rains : ఓవైపు నివర్‌ తుఫాన్‌ ప్రభావం కొనసాగుతోంది. ఏపీ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతుంటే… అటు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. దీన్నుంచి ఇంకా కోలుకోక ముందే వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది.

వాయుగుండం అల్పపీడనంగా మారింది. కోస్తాంధ్రపై ఈ అల్పపీడనం ఆవరించి ఉంది. మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మళ్లీ వరుణుడు దాడి చేసేందుకు సిద్ధమవుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.