ఆర్థిక రాజధానిని ముంచెత్తిన వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల రాకతో ఈ ఏడాది మొదటి సారి జోరువాన పడింది. నగరంలోని విరార్, జుహు, ములుంద్, ధారవీ ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. భారీ వర్షాలతో అటు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రోడ్లపైన పలు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ తెరవొద్దని అధికారులు తెలిపారు. […]

ఆర్థిక రాజధానిని ముంచెత్తిన వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 8:06 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల రాకతో ఈ ఏడాది మొదటి సారి జోరువాన పడింది. నగరంలోని విరార్, జుహు, ములుంద్, ధారవీ ప్రాంతాల్లో తెల్లవారుజామునుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరింది. భారీ వర్షాలతో అటు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రోడ్లపైన పలు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.

మరోవైపు ముంపు ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ తెరవొద్దని అధికారులు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. కాగా, రాష్ట్రంలోని థానే, పాల్ఘర్‌, గ్రేటర్‌ ముంబయి, రత్నగిరి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. మరి కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.