కివీస్‌తో భారత్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి?

ఐసీసీ ప్రపంచకప్ 2019లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలుపొంది జోరుమీదున్న టీమిండియా తమ మూడోమ్యాచ్‌ ఆడడం అనుమానమే. నాటింగ్‌హామ్‌లోని టెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వర్షం భారత్‌, కివీస్‌ మ్యాచ్‌కూ అడ్డుపడే అవకాశముంది. బర్మింగ్‌హామ్‌, పీటర్‌బొరో, న్యూ కాజిల్‌ సహా ఇంగ్లండ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. సుదీర్ఘంగా కురిసే వర్షంతో […]

కివీస్‌తో భారత్‌ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి?
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2019 | 12:28 PM

ఐసీసీ ప్రపంచకప్ 2019లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలుపొంది జోరుమీదున్న టీమిండియా తమ మూడోమ్యాచ్‌ ఆడడం అనుమానమే. నాటింగ్‌హామ్‌లోని టెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా గురువారం న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. టోర్నీలో ఇప్పటికే పలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన వర్షం భారత్‌, కివీస్‌ మ్యాచ్‌కూ అడ్డుపడే అవకాశముంది. బర్మింగ్‌హామ్‌, పీటర్‌బొరో, న్యూ కాజిల్‌ సహా ఇంగ్లండ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. సుదీర్ఘంగా కురిసే వర్షంతో వరదలు కూడా వచ్చేందుకు ఆస్కారముందని, రవాణాకు తీవ్ర అంతరాయం కలగొచ్చని ప్రజలను హెచ్చరించింది. కాగా, నాటింగ్‌హామ్‌లో బుధవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసి, గురువారం మధ్యాహ్నం వరకు జల్లులు కురుస్తాయని పేర్కొంది. కోహ్లీసేనకు వరుసగా రెండోరోజూ ప్రాక్టీస్ కు దూరమైంది. వర్షం కారణంగా మంగళవారం ఇక్కడ జరగాల్సిన టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయింది.