విటమిన్ B12ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే షాకవుతారు

బరువు తగ్గడం కోసం నేటి కాలంలో చాలామంది కఠినమైన డైట్లను అనుసరిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో మనం తీసుకునే ఆహార నియమాలు కొన్నిసార్లు శరీరానికి అత్యవసరమైన పోషకాలను దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా విటమిన్ బి-12 లోపం అన్ని వయసుల వారిలో, ప్రధానంగా టీనేజర్లలో ఎక్కువగా కనిపిస్తోందని జనరల్ ఫిజీషియన్ సంజల్ నగర్కర్ హెచ్చరిస్తున్నారు. విటమిన్-డి తో సమానంగా ఈ విటమిన్ బి-12 ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువని వైద్యులు వివరిస్తున్నారు.

విటమిన్ B12ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే షాకవుతారు
Vitamin B12 Deficiency.jpg

Updated on: Jun 06, 2026 | 10:25 PM

మన శరీరంలో ఎర్ర రక్తకణాల తయారీకి విటమిన్ బి-12 అత్యంత అవసరం. ఈ విటమిన్ లోపించినప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. ఇది కేవలం నీరసానికే పరిమితం కాకుండా, ఇన్ఫ్లమేషన్, తీవ్రమైన అలసట మరియు జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా, నడిచేటప్పుడు ఇబ్బందిగా అనిపించడం, కాళ్లలో తిమ్మిర్లు పట్టడం, ఆకలి మందగించడం, వాంతులు, డయేరియా మరియు మానసిక ఒత్తిడి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి, పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

విటమిన్ బి-12ను ఎలా పొందాలి?

సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు మరియు ఇతర డైరీ ఉత్పత్తులు చేర్చుకోవాలి. ఇవి బి-12కు మంచి మూలాలు. సాల్మన్ చేపలు, చికెన్, గుడ్లు బి-12 సమృద్ధిగా లభిస్తుంది. బాదం, పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా బి-12 పొందవచ్చు. అవసరమైతే, వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా ఈ లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.

బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరంగా జరగాలే తప్ప, పోషకాహార లోపంతో కాదని గుర్తుంచుకోవాలి. మీరు అనుసరిస్తున్న డైట్ వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే, వెంటనే నిపుణుల సలహాలు తీసుకుని, మీ ఆహారపు అలవాట్లను సరిచేసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, దృఢమైన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. విటమిన్ బి-12 లోపం పట్ల అవగాహన కలిగి ఉండటం, సకాలంలో స్పందించడం మీ ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us