ఎండు ద్రాక్షలను తినే ఆహారంలో చేర్చుకుంటే.. అనేక రకాల పోషకాలను శరీరానికి అందించినట్లే. ఈ పోషకాలు మనకు ఎంతగానో ఉపకరించడమే కాక ఎన్నో ప్రయోజనాలను కూడా అందిస్తాయి.సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా లభించే ఎండు ద్రాక్షలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ( Fiber ) పుష్కలంగా ఉంటాయి. అంతకుమించి ఎండు ద్రాక్షలు ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. ఇంకా ఈ ఎండు ద్రాక్షలను పరిమితంగా తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా దరి చేరవు. మరి ఈ క్రమంలో ఎండుద్రాక్షలను తినడం ద్వారా ఏయే ప్రయోజనాలను పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శక్తి: ఎండుద్రాక్షలు కార్బోహైడ్రేట్లు, నేచరల్ షుగర్లతో ఉంటాయి. ప్రతి రోజు కొన్ని ఎండు ద్రాక్షలు తినటం వల్ల మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.
బరువు తగ్గడం: ఎండు ద్రాక్షలను నిత్యం తినే వ్యక్తులు తక్కువ బరువును కలిగి ఉంటారు. ఇంకా వీరికి ఊబకాయం కూడా దూరంగా ఉంటుంది.
రక్తహీనత: ఎండుద్రాక్షలు ఐరన్‌ను అధికంగా కల్గి ఉంటాయి. కాబట్టి రక్తహీనతతో బాధపడేవాళ్లకు ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇంకా ఐరల్ లోపాన్ని కూడా అధిగమించవచ్చు.
చర్మం కోసం: ఎండుద్రాక్షలో అనామ్ల జనకాలు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, నష్టాన్నితగ్గించడానికి సహాయపడతాయి. ఇంకా కళ్ల కింద చారలు, చర్మపు ముడుతలను నిరోధిస్తుంది. ఎండు ద్రాక్ష చర్మ క్యాన్సర్‌ను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియ కోసం: ఎండుద్రాక్షలు పీచుపదార్థాలకు మంచి మూలం. కాబట్టి మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారించడంలో ఎండు ద్రాక్ష మనకు సహాయపడుతుంది.
మధుమేహం: ఎండుద్రాక్షలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. ఇంకా మధుమేహం ఉన్నవారికి ఇది ఓ మంచి ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉంటుంది.
గుండె కోసం: ఎండు ద్రాక్షలు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె సమస్యలు ఎదురయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి మనకు ఉపయోగపడతాయి.
పళ్ళు కోసం: ఎండు ద్రాక్షలు తీపిగా ఉన్నప్పటికీ, వాటిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఆ కారణంగా ఇవి పళ్ళకు హాని చేయవు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..