Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!

|

Nov 14, 2021 | 2:47 PM

కోవిషీల్డ్ మొదటి, రెండవ డోసుల మధ్య 12 వారాల గ్యాప్ ఉన్నవారికి మెరుగైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందింది. సెరో సర్వే ప్రకారం, ఈ వ్యక్తులకు వెంటనే బూస్టర్ డోస్ అవసరం లేదు.

Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!
Covishield Vaccine
Follow us on

Corona Vaccine:  కోవిషీల్డ్ మొదటి, రెండవ డోసుల మధ్య 12 వారాల గ్యాప్ ఉన్నవారికి మెరుగైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందింది. సెరో సర్వే ప్రకారం, ఈ వ్యక్తులకు వెంటనే బూస్టర్ డోస్ అవసరం లేదు. ఈ నివేదికను ఉటంకిస్తూ, నిపుణులు దేశంలో రెండు మోతాదుల మధ్య ఇప్పుడున్న అంతరాన్ని తగ్గించే అవకాశాలను తోసిపుచ్చారు. ప్రస్తుతం, కోవిషీల్డ్ మొదటి, రెండవ డోసుల మధ్య 12 నుండి 16 వారాల గ్యాప్ ఉంది. ఈ నివేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలనకు సమర్పించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తాము డేటాను రోజూ సమీక్షిస్తున్నామని, అందుబాటులో ఉన్న టీకా డేటాను కూడా తాము విస్తృతంగా అధ్యయనం చేశామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏదైనా నిర్ణయాన్ని శాస్త్రీయ వాస్తవాల ఆధారంగా మాత్రమే తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.

112 కోట్ల డోస్‌లు..

దేశంలో మొత్తం 112 కోట్ల కంటే ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇచ్చారు. ఇందులో 88% కోవిషీల్డ్. కోవిషీల్డ్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా సంయుక్త ఆవిష్కరణ. స్థానిక స్థాయిలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనిని సిద్ధం చేస్తోంది.

కరోనా టీకాల రెండు మోతాదులు మొత్తం జనాభాలో 39% మందికి ఇచ్చారు. జనాభాలో 79% కంటే ఎక్కువ మందికి కోవిడ్ వ్యాక్సిన్ కనీసం ఒక డోస్ అందచేశారు. అదే సమయంలో, సుమారు 39% మంది రెండు మోతాదులను తీసుకున్నారు. డేటా ప్రకారం, రెండవ డోస్ తీసుకోవడానికి 120 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు.

రెండుసార్లు మార్పు..

కోవ్‌షీల్డ్ రెండు డోసుల మధ్య వ్యత్యాసాన్ని కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు మార్చింది. అంతకుముందు మార్చి 22న, రెండు మోతాదుల వ్యత్యాసాన్ని 4-6 వారాల నుంచి 6-8 వారాలకు పెంచారు. ఆ తర్వాత మే 13న ఈ తేడాను 12-16 వారాలకు పెంచారు. కోవాక్సిన్ మోతాదు వ్యత్యాసంలో ఎటువంటి మార్పు లేదు.

ఇవి కూడా చదవండి: Crypto Currency: అక్రమ క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి..అధికారులను కోరిన ప్రధాని మోడీ

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!