
సాధారణంగా గోళ్లు మన అంతర్గత ఆరోగ్యం ఎలా ఉందో సూచించే ఒక కిటికీ లాంటివి. చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించేందుకు దగ్గు, ఛాతీ నొప్పి లేదా బరువు తగ్గడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, గోళ్లలో కనిపించే ఒక చిన్న మార్పు, క్లబ్బింగ్ అని పిలవబడేది, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన పరిస్థితులకు సంబంధించిన ఒక ప్రారంభ హెచ్చరిక సంకేతం కావచ్చని మీకు తెలుసా?. సాధారణ గోళ్లు నునుపుగా, గులాబీ రంగులో, గోరు అంచున చిన్న అర్ధచంద్రాకార ఆకారంతో (లెన్యూలా) ఉంటాయి.
అయితే, గోరు స్ట్రెయిట్‌గా కాకుండా ఒక వంపును తీసుకున్నప్పుడు, అది క్లబ్బింగ్‌గా పరిగణించబడుతుంది. క్లబ్బింగ్‌కు అత్యంత సాధారణ కారణాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటిగా చెప్పబడుతుంది. క్లబ్బింగ్‌ను ఎలా గుర్తించవచ్చంటే.. మన గోరుకు, నెయిల్ బెడ్‌కు మధ్య సాధారణంగా ఒక కోణం ఉంటుంది. ఈ కోణం పెరిగినప్పుడు అది క్లబ్బింగ్ అవుతుంది. క్లబ్బింగ్ ఉందా లేదా అని సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. మీ రెండు వేళ్లను కలిపి, మధ్యలో ఒక చిన్న డైమండ్ ఆకారం కనిపిస్తే, అది సాధారణమైన గోరు. ఆ కోణం గనక పోయి, డైమండ్ ఆకారం కనిపించకపోతే, అది క్లబ్బింగ్ అని అర్థం. ఇటువంటి మార్పులను గుర్తించినప్పుడు, తదుపరి వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
మీకు మరింత స్పష్టత కోసం వీడియోను దిగునవ చూడండి…