Lemon Peels Benefits: నిమ్మకాయ ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. ఇది చర్మం, జుట్టు, పొట్ట ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని రసం ఎంత పులుపు ఉన్నా.. ఏ ఔషధానికీ తక్కువ కాదు. సాధారణంగా మనం నిమ్మకాయను పిండి వాటి తొక్కలను పనికిరానివిగా.. భావించి తరచుగా చెత్తబుట్టలో వేస్తాం. కానీ వాటి ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుంటే.. బహుశా జీవితంలో అలాంటి తప్పు చేయాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే.. నిమ్మకాయ తొక్కలను పలు రకాలుగా ఉపయోగించవచ్చు. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కావున నిమ్మకాయ తొక్కల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మ తొక్కల ప్రయోజనాలు..
నిమ్మ తొక్కలలో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
యాంటీ-ఆక్సిడెంట్లు కూడా నిమ్మ తొక్కలలో కనిపిస్తాయి. ఇవి శరీరానికి బాహ్య, అంతర్గత మార్గంలో ప్రయోజనం చేకూరుస్తాయి.
నిమ్మ తొక్కలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
నిమ్మతొక్కలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దంతాలు, నోటి సమస్యలను దూరం చేస్తాయి.