Best Food: జిమ్ చేసిన తర్వాత ఈ ఫుడ్ తింటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..

Best Workout Recovery Foods: ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో.. ఆ తర్వాత ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అందులో.. ఎక్సర్‌సైజ్‌ చేశాక తినొచ్చా లేదా? ఎంత సేపు ఆగిన తర్వాత తినాలి..?

Best Food: జిమ్ చేసిన తర్వాత ఈ ఫుడ్ తింటే ఎన్నో ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..
Pre And Post Workout Foods

Updated on: May 05, 2022 | 3:33 PM

ఆరోగ్యం కోసం వ్యాయామం(Workout) చేయడం ఎంత ముఖ్యమో.. ఆ తర్వాత ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అందులో.. ఎక్సర్‌సైజ్‌(exercise) చేశాక తినొచ్చా లేదా? ఎంత సేపు ఆగిన తర్వాత తినాలి..? ఇలా చాలా అనుమానాలుంటాయి. కొంతమంది డైటింగ్‌ అనీ కసరత్తుల తర్వాత అస్సలు ఏమీ తినరు. అది సమస్యను మరింత పెద్ద సమస్యగా మార్చేస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం చాల ముఖ్యం. అయితే ఆరోగ్య నిపుణులు చెప్పే కొన్ని సూచనలను ఇక్కడ మనం తెలుసుకుందాం..

  1. శరీరానికి గ్లైకోజన్‌ ఇంధనంలా పని చేస్తుంది. వ్యాయామం సమయంలో ఇది ఖర్చైపోతుంది. దీన్ని మళ్లీ తిరిగి పెంచుకోవాలంటే ఎముకల్లోని ప్రొటీన్‌ను పెంపొందించుకోవాలన్నా దేహానికి తగినన్ని పోషకాలు కావాలి. అది కూడా వ్యాయామం ముగిసిన 45 నిమిషాల్లోపే చేయాలి. అలా తినేటప్పుడు ‘ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్‌’ ఉండేలా చూసుకోవాలి.
  2. వ్యాయామం చేసేదే ఫ్యాట్ తగ్గించుకుందుకు కాదా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. మళ్లీ దాన్నే తినమంటారేంటి అనుకుంటారు. జీవక్రియలకు కొవ్వు చాలా అవసరం. తక్కువ మోతాదులో అయినా తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి శక్తిని అందించడంలో కొవ్వుది కూడా ప్రధాన పాత్ర. మంచి కొవ్వును ఇచ్చే అవకాడో, నట్స్‌, గుమ్మడి, పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకుంటే సరిపోతుంది.
  3. మనం వ్యాయామం చేస్తున్నప్పుడు ఎలక్ట్రోలైట్‌లు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి, నీటినీ ఎక్కువగా తీసుకుంటే మంచింది. ఇందులో పండ్ల రసాలు, గ్లూకోజ్‌ నీళ్లు వంటివీ మీకు సహాయపడుతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి
Loading...
Unable to load recommendations.
Follow Us