
భారత దేశంలో భోజనం అనగానే అరటి ఆకు భోజనమే గుర్తుకు వస్తుంది. ఇప్పుడంటే అరటి ఆకుల్లో భోజనం తగ్గించేశారు. కానీ ఇంతకు ముందు అరటి ఆకుల్లోనే భోజనం వడ్డించేవారు. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ ప్లేట్స్‌లో పెడుతున్నారు. ఈ ఆకుల్లో భోజనం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కానీ అరటి ఆకులో భోజనం చేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఇజ్రాయెల్ జనాభాలో దాదాపు 13% మంది శాఖాహారులు ఉన్నారు. 'కోషర్' ఆహార చట్టాలు, 'శాకాహారి' ఉద్యమం ఇక్కడ చాలా ప్రభావవంతమైనవి. టెల్ అవీవ్ నగరాన్ని ప్రపంచంలోని 'శాకాహారి రాజధాని' అని కూడా పిలుస్తారు.

ధర తక్కువ: అరటి ఆకుల్లో భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదే కాదు. వీటి ధర కూడా చాలా తక్కువ. కాబట్టి వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. డబ్బు కూడా ఆదా అవుతుంది. అలాగే దీనిలో భోజనం చేయడం వల్ల చాల లాభాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

పర్యావరణానికి అనుకూలం: ఇప్పుడు భోజనం చేసే ప్లాస్టిక్ ప్లేట్స్ కంటే.. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవి భూమిలో త్వరగా ఇంకిపోతాయి. పర్యావరణానికి చాలా మంచిది.

పరిశుభ్రంగా ఉంటుంది: ఇతర పాత్రలు, ఆకుల కంటే పోల్చితే అరటి ఆకుల్లో తినడం చాలా మంచిది. కేవలం వీటిని నీటితో కడిగి ఉపయోగిస్తే చాలు. అరటి ఆకులపై మైనపు పూత ఉంటుంది. ఇది ఆకుల ఉపరి తలంపై మురికి, దుమ్ము అంటుకోకుండా చేస్తుంది. ఆహారంలోని సూక్ష్మ క్రిములను దూరం చేసి.. చక్కటి రుచులను అందిస్తుంది.