Heart Function: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..!

|

May 03, 2022 | 1:25 PM

Heart Function: గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. దీనిని కచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. శరీరమం మొత్తానికి

Heart Function: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..!
Heart Function
Follow us on

Heart Function: గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. దీనిని కచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. శరీరమం మొత్తానికి గుండె రక్తాన్ని పంపుచేస్తుంది. ఆక్సిజన్, పోషకాలని రక్తం ద్వారా అన్ని భాగాలకి పంపుతుంది. అంతేకాదు శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించే పని చేస్తుంది. మన శరీరంలో గుండె ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. దీని ఆకారం శంఖంలా ఉంటుంది. బరువు సుమారు 299 గ్రాములు ఉంటుంది. గుండెలో రెండు గదులు ఉంటాయి. దిగువ భాగాన్ని జఠరిక అంటారు. ఆక్సిజన్ లేని రక్తం కర్ణిక సహాయంతో గుండెకు చేరుతుంది. అలాగే కుడి జఠరిక నుంచి రక్తం ఊపిరితిత్తులకు వెళుతుంది. ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని గుండె ఎడమ గది నుంచి శరీరంలోని మిగిలిన భాగాలకు పంపు చేస్తుంది. కర్ణిక, జఠరికలు గుండె నుంచి రక్తాన్ని పంప్ చేస్తాయి అలాగే రక్తాన్ని తిరిగి గుండెకి తీసుకొస్తాయి. ఒక సాధారణ మనిషి గుండె ఒక నిమిషంలో 72 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది.

గుండె జబ్బు లక్షణాలు

ఆకస్మిక వేగవంతమైన హృదయ స్పందన, ఆకస్మిక గుండె నొప్పి, మూర్ఛ, చెమటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం మొదలైనవి ఉంటాయి.

గుండె జబ్బులు

కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు, రుమాటిక్ హార్ట్ డిసీజ్, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022, Orange Cap: టాప్‌ 5లోకి దూసుకొచ్చిన శ్రేయాస్‌ అయ్యర్.. వెనుకబడిన హార్దిక్ పాండ్య..!

ITC MAARS App: రైతులకి గుడ్ న్యూస్‌.. సమస్యల పరిష్కారానికి ఐటీసీ మార్స్‌ యాప్..!

IPL 2022: ఒక రైతు కొడుకు ఐపీఎల్‌లో కోట్లు సంపాదిస్తున్నాడు.. పేదరికంలో పెరిగిన మరో ‘విరాట్‌’..!