Radish Benefits: ఈ పదార్థాలను ముల్లంగితో కలిపి తినకండి.. అలా చేస్తే విషంతో సమానమట..

|

Feb 28, 2023 | 4:49 PM

ముల్లంగిలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే ముల్లంగిని సరైన సమయానికి, సరైన పద్దతిలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. లేదంటే గ్యాస్ సమస్య, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. ఒకసారి అవేంటో పరిశీలిద్దాం..

1 / 5
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగిన ముల్లంగి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు జలుబు, దగ్గు, నోటి సమస్యలు.. ఉదరం, మూత్రపిండాలు, డయాబెటిస్ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

2 / 5
నిద్రలేవగానే ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగిని తినకూడదు. అల్పాహారం తర్వాత గానీ.. భోజనానికి ముందుగానీ ముల్లంగిని తీసుకోవాలి. అలాగే సాయంత్రం వేళ సలాడ్‌గా ముల్లంగిని తినొచ్చు. ఇలా తినడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

3 / 5
ముల్లంగిని సలాడ్‌గా తినడం ఉత్తమ మార్గం. మీరు ముల్లంగితో పాటు టమోటా, క్యారెట్, దోసకాయ, ఉల్లిపాయ మొదలైన ఇతర పచ్చి కూరగాయలను సలాడ్‌గా తీసుకోవచ్చు. ఇలా తినడం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నల్ల ఉప్పుతో కలిపి ముల్లంగిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

4 / 5
అలాగే ముల్లంగి తిన్న తర్వాత కొంతసేపు నడవండి. గ్యాస్, అసిడిటీ మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మీకు బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే.. మీ శరీరానికి ఎక్కువ శ్రమ పెట్టలేరు. కాబట్టి ఆ సమయంలో ముల్లంగికి దూరంగా ఉండండి. అంతేకాకుండా రాత్రిపూట ముల్లంగిని ఏ రూపంలోనూ తినకూడదు.

5 / 5
ముల్లంగి-నారింజ, ముల్లంగి-కీరదోస, ముల్లంగి-కాకరకాయ, ముల్లంగి-పాలు.. ఇవి కలిపి తినకూడదు. కనీసం 10 గంటల నుంచి 24 గంటల గ్యాప్ ఉండాలి. ముల్లంగిని తినే ముందు శుభ్రంగా కడిగి.. వాటి తొక్క తీయాలి.