గర్భిణీ స్త్రీలు భేషుగ్గా కాఫీ లాగించేయొచ్చు.. కానీ అలా మాత్రం చేయకూడదు.. అధ్యయనంలో కీలక విషయాలు

నిత్యం ఎన్నో సమస్యలలో సతమతమవుతుంటాం. ఒత్తిడి, చికాకు, మానసిక ప్రశాంతత నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు టీ(Tea), కాఫీలు(Coffee) తాగుతుంటారు. అయితే మహిళలు గర్భం ధరించాక కాఫీ తాగే అంశంపై ఎన్నో....

గర్భిణీ స్త్రీలు భేషుగ్గా కాఫీ లాగించేయొచ్చు.. కానీ అలా మాత్రం చేయకూడదు.. అధ్యయనంలో కీలక విషయాలు
Coffee
Follow us

|

Updated on: Jun 16, 2022 | 7:43 AM

నిత్యం ఎన్నో సమస్యలలో సతమతమవుతుంటాం. ఒత్తిడి, చికాకు, మానసిక ప్రశాంతత నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు టీ(Tea), కాఫీలు(Coffee) తాగుతుంటారు. అయితే మహిళలు గర్భం ధరించాక కాఫీ తాగే అంశంపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఓ శాస్త్రవేత్తల బృందం రీసెర్చ్ చేసింది. గర్భిణీ స్త్రీలు కాఫీ తాగడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని గుర్తించింది. గర్భిణీ స్త్తీలు కాఫీ తాగడం వల్ల చురుగ్గా ఉండగలరని ఓ పరిశోధనలో వెల్లడైంది. అయితే రోజూ తీసుకునే కాఫీలో కెఫిన్ 300 మిల్లీ గ్రాములు మించవద్దని సూచించింది. కాగా.. మహిళలు గర్భం ధరించాక కాఫీ తాగొచ్చా, తాగకూడదా అనే అంశంపై మెండెలియన్ రాండమైజేషన్ పద్ధతిని ఉపయోగించారు. గర్భిణీ స్త్రీలు కాఫీ తాగాక వారిలో కలిగే ప్రవర్తనను అంచనా వేసే విధంగా రూపొందించారు. ఎనిమిది జన్యు వైవిధ్యాలను ఉపయోగించి, అవి సంతానంపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయో గుర్తించారు. అంతే కాకుండా గర్భధారణ సమయంలో కాఫీ తాగడం వల్ల గర్భస్రావం, నెలలు నిండకుండానే శిశువులు పుట్టే ప్రమాదం లేదని ఓ పరిశోధనలో తేటతెల్లమైంది.

కాఫీ తాగ‌డం వ‌ల్ల వృద్ధాప్యంలో అల్జీమ‌ర్స్‌ రాకుండా అడ్డుకోవ‌చ్చని అధ్యయ‌నాలు చెబుతున్నాయి. క్రమం తప్పకుండా కాఫీని తాగడం వలన హార్మోన్ ఎపినెఫ్రిన్ పెరుగుతుంది. ఇది శారీరక పనితీరు, కండరాల బలాన్ని మెరుగు ప‌రుస్తుంది. కాఫీలో మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ బి అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అయితే కాఫీ తాగ‌డం వ‌ల్ల ప్రయోజ‌నాలు క‌లిగిన‌ప్పటికీ దీన్ని రోజుకు 2 నుంచి 4 క‌ప్పుల వ‌ర‌కు మాత్రమే తాగాలి.

ఇవి కూడా చదవండి