Mouth Ulcer: నోటిపూత సమస్యతో బాధపడుతున్నారా.? ఇలా చేస్తే వెంటనే ఫలితం ఉంటుంది..

Mouth Ulcer: నోటిపూత (మౌత్ అల్సర్‌) సర్వసాధారణమైన సమస్య. అయితే దీనితో బాధపడేవారికి మాత్రం తీవ్ర ఇబ్బంది ఉంటుంది. ఏం తినలేరు, తాగలేరు. సాధారణంగా శరీరంలో వేడి ఎక్కువ కావడం...

Mouth Ulcer: నోటిపూత సమస్యతో బాధపడుతున్నారా.? ఇలా చేస్తే వెంటనే ఫలితం ఉంటుంది..
Mouth Ulcer
Follow us

|

Updated on: May 23, 2022 | 6:50 AM

Mouth Ulcer: నోటిపూత (మౌత్ అల్సర్‌) సర్వసాధారణమైన సమస్య. అయితే దీనితో బాధపడేవారికి మాత్రం తీవ్ర ఇబ్బంది ఉంటుంది. ఏం తినలేరు, తాగలేరు. సాధారణంగా శరీరంలో వేడి ఎక్కువ కావడం, ఒత్తిడి, డీహైడ్రేషన్‌ కారణంగా నోటిపూత బారిన పడుతుంటారు. అయితే ఈ సమస్య వచ్చిన వెంటనే వైద్యుని వద్దకు పరిగెత్తకుండా ఇంట్లో లభించే కొన్ని వస్తువులతోనే ఉపశమనం పొందొచ్చని మీకు తెలుసా.? ఇంతకీ నోటిపూతను న్యాచురల్‌గా చెక్‌ పెట్టేందుకు ఎలాంటి టిప్స్‌ పాటించాలి లాంటి వివరాలు మీకోసం..

* నోటి పూత వల్లే కలిగే నొప్పి నుంచి అప్పటికప్పుడు ఉపశమనం లభించాలంటే చిన్న ఐస్‌ ముక్కను తీసుకుని గాయం ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా రుద్దాలి. అలాగే బాగా చల్లటి నీటితో నోరు శుభ్రపరచుకోవడం చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది.

* ఇక లవంగం నమలడం, లవంగం నూనె సమస్య ఉన్న ప్రాంతంలో పూయడం ద్వారా కూడా సమస్యను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

* తేనె న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల నోటిపూత నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. తేనెలో కాస్త పసుపు వేసి సమస్య ఉన్న భాగంలో రాయాలి.

* శరీరంలో పెరిగిన వేడి తగ్గించడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి నోటి పూత సమస్య ఉన్న వారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

* నోటిలో కొన్ని నీళ్లు పోసుకుని తర్వాత కొన్ని తులసి ఆకుల్ని వేసుకుని.. నీటితో పాటే నమలాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన చిట్కాలు ప్రాథమిక సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. నోటిపూత తగ్గడంలో ఈ టిప్స్‌ ఫలితాన్ని చూపించినప్పటికీ. ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించిన తర్వాతే ఇలాంటివి పాటించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ కథనాల కోసం క్లిక్ చేయండి..