స్పృహ కోల్పోయిన వ్యక్తికి నీరు ఇవ్వొచ్చా.. సీపీఆర్ ఎప్పుడు చేయాలి.. తప్పనిసరిగా తెలుసుకోండి

దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. దాదాపు 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతమైన వేడి, వేడగాల్పులతో జనం అల్లాడుతున్నారు. ఈ తరహా వాతావరణంలో అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్పృహ కోల్పోయిన వ్యక్తికి నీరు ఇవ్వొచ్చా.. సీపీఆర్ ఎప్పుడు చేయాలి.. తప్పనిసరిగా తెలుసుకోండి
Health Care Tips
Follow us

|

Updated on: May 09, 2024 | 3:55 PM

దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. దాదాపు 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతమైన వేడి, వేడగాల్పులతో జనం అల్లాడుతున్నారు. ఈ తరహా వాతావరణంలో అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వేడి కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీని వల్ల మూర్ఛపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. విపరీతమైన వేడికి ప్రజలు స్పృహ కోల్పోవడం కూడా కనిపిస్తుంది. అయితే, అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని స్పృహలోకి తీసుకురావడానికి, కొంతమంది వారికి తాగడానికి నీరు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. చాలా సందర్భాలలో, అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని తిరిగి స్పృహలోకి ఎలా తీసుకురావాలో లేదా అతనికి ఎలా ప్రథమ చికిత్స అందించాలో ప్రజలకు తెలియదు.. ఇలాంటి పరిస్థితుల్లో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రాథమిక చికిత్స అందించాలో నిపుణుల నుంచి సమాచారం తెలుసుకోండి..

స్పృహ కోల్పోయిన వ్యక్తికి నీరు ఇవ్వొచ్చా..

స్పృహ కోల్పోయిన వ్యక్తికి నీరు ఇవ్వకూడదని ఢిల్లీలోని లేడీ హార్డింజ్ హాస్పిటల్ మాజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి అంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఎవరైనా అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే నీరు ఇవ్వకూడదని మంత్రిత్వ శాఖ తెలిపింది. అపస్మారక స్థితికి చేరుకున్న వ్యక్తి నీరు త్రాగడానికి ఇబ్బంది పడడమే దీనికి కారణం. నీరు సరిగ్గా కడుపులోకి ప్రవేశించదు. ఈ సమయంలో గుండెల్లో మంట కూడా సంభవించవచ్చు. అటువంటి పరిస్థితిలో, అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఇది అపస్మారక స్థితిలో ఉన్న వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. అటువంటి పరిస్థితిలో, వెంటనే వ్యక్తికి నీరు ఇవ్వకుండా ప్రయత్నించండి. ఈ క్రమంలో కొంచెం స్పృహలోకి వచ్చినట్లయితే త్రాగడానికి నీరు ఇవ్వవచ్చు.. అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎవరైనా మూర్ఛపోతే ఏమి చేయాలి..

ఢిల్లీలోని జీబీ పంత్ హాస్పిటల్‌లోని న్యూరోసర్జరీ విభాగం ప్రొఫెసర్ దల్జీత్ సింగ్ మాట్లాడుతూ.. ఎవరైనా అపస్మారక స్థితిలోకి వెళితే.. ముందుగా అతని తలను మీ చేతులతో పైకి ఎత్తి పట్టుకోవాలి. ఈ సమయంలో, ముఖం మీద తేలికగా నీటిని చిలకరించాలి. వ్యక్తి మీ ప్రయత్నానికి ప్రతిస్పందిస్తున్నట్లయితే ఫర్వాలేదు. ఈ సమయంలో, అతను శ్వాస తీసుకుంటున్నాడా లేదా..? పల్స్ ఉందా లేదా? అని చూడండి. ఈ రెండూ ఉంటే ఫర్వాలేదు.. ఇబ్బంది ఉండదు.. శ్వాస సరిగా లేకపోతే వెంటనే పేషెంట్‌కి CPR ఇవ్వండి.

CPR ( కార్డియో పల్మరీ రిసస్కిటేషన్) ఎలా ఇవ్వాలి

పేషెంట్​ను ముందుగా వెల్లకిలా పడుకోబెట్టాలి. అనంతరం రోగి ఛాతీ మధ్యలో మీ రెండు అరచేతులను ఒకదానిపై ఒకటి ఉంచి.. నెమ్మదిగా ఛాతీపై 4 సెం.మీ. మేర ప్రెస్ చేయాలి.. 1 నిమిషంలో 100 నుండి 120 కుదింపుల చొప్పున ఛాతీ మధ్యభాగం (గుండె మీద కాదు) పై ప్రెస్ చేయాలి.. ఇలా రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది. దీనినే CPR అంటారు. దీన్ని ఇవ్వడం ద్వారా, శరీర భాగాలు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పొందుతాయి.. CPR ఇచ్చే సమయంలో అంబులెన్స్‌కు కాల్ చేయడం కూడా చాలా ముఖ్యం. CPR ఇవ్వడం వల్ల రోగి మంచి స్థితిలో ఆసుపత్రికి చేరుకునే అవకాశం పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే సింపుల్ టిప్స్ మీ కోసం
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
ఆ రెండు స్థానాలు బెట్టింగ్ రాయుళ్ల హాట్ సీట్లు.. ఫలితాలపై ఉత్కంఠ.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ..పేరేంటంటే?
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. దేశంలోని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
పెరుగుతో వీటిని కలిపి తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
మట్టి పాత్రల్లో వంట చేస్తే అంత ఆరోగ్యం దాగి ఉందా? డోంట్ మిస్..
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
ఆధార్‌ దుర్వినియోగం కేసులో ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా..?
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
లేడీస్ అనుకుంటే ఆగమైనట్లే.. కన్నేసి వస్తారు.. ఆ తర్వాతే అసలు కథ..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?