టెక్నాలజీ మన జీవితాలపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.. ప్రస్తుత కాంలో స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండటం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. ఉదయాన్నే ఫోన్ని చెక్ చేయడం, నిద్రపోయే ముందు స్క్రోలింగ్ చేయడం, నోటిఫికేషన్ల చిరుజల్లు – ఇవన్నీ మనకు అనుక్షణం అలవాటయ్యాయి. అయితే, మీరు మీ ఫోన్ను వారం రోజులపాటు పూర్తిగా దూరంగా ఉంచితే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో డిజిటల్ డిటాక్స్ అనే పదం చాలా చర్చనీయాంశమైంది. దీని అర్థం డిజిటల్ పరికరాలకు, ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియాకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలి. స్థిరమైన స్క్రీన్ సమయం, ఆన్లైన్ ఉనికి మన మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే., డిజిటల్ డిటాక్స్ పాటించాలంటూ పలువురు సూచిస్తున్నారు.
డిజిటల్ ప్రపంచానికి నిరంతరం కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్ర సమస్యలు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ డిటాక్స్ ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. అయితే, ఫోన్ను వారం రోజుల పాటు పూర్తిగా దూరంగా ఉంచడం అందరికీ అంత సులభం కాదు. ప్రారంభంలో, అశాంతి, నోటిఫికేషన్లు తప్పిపోతామనే భయం లేదా పనిలో ఏదైనా సమస్యల ఏర్పడతాయేమోనన్న భయం లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది.
డిజిటల్ డిటాక్స్ అనేది మీ ఫోన్ను పూర్తిగా వదులుకోవడం కాదు, కానీ ఇది డిజిటల్ ప్రపంచంపై మీ ఆధారపడటాన్ని తగ్గించడానికి.. మీ జీవితాన్ని నియంత్రించడానికి ఒక మార్గం..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..