కొబ్బరినీరా..? నిమ్మరసమా..? మండే ఎండల్లో ఏ పానీయం ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది..

వేసవి కాలంలో శరీరంలో హైడ్రేషన్‌ను నిర్వహించడం అవసరం.. దీని కోసం మనం ఎప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఉత్తమం.. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కొబ్బరి నీళ్లు తాగితే మరికొంత మంది నిమ్మరసం తాగేందుకు ఇష్టపడుతుంటారు. కావున ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకోండి..

కొబ్బరినీరా..? నిమ్మరసమా..? మండే ఎండల్లో ఏ పానీయం ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది..
Coconut Water Lemon Water
Follow us

|

Updated on: Apr 18, 2024 | 3:12 PM

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతతో చాలా మంది ప్రజలు డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. ఈ సీజన్‌లో ఎప్పటికప్పుడు హైడ్రేటింగ్ డ్రింక్ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. హైడ్రేటింగ్ డ్రింక్స్ విషయానికి వస్తే, ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది నిమ్మకాయ నీరు.. కొబ్బరి నీరు.. ఈ రెండు ద్రవపదార్థాలు డీహైడ్రేషన్ సమస్య నుంచి శరీరాన్ని రక్షించడానికి ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు. అయితే, ఈ రెండింటిలో ఏది మంచిదని ప్రజలు తరచుగా ఆలోచిస్తుంటారు.. వేసవి కాలంలో శరీరంలో హైడ్రేషన్‌ను నిర్వహించడం అవసరం.. దీని కోసం మనం ఎప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఉత్తమం.. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు కొబ్బరి నీళ్లు తాగితే మరికొంత మంది నిమ్మరసం తాగేందుకు ఇష్టపడుతుంటారు. కావున ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకోండి..

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

కొబ్బరి నీళ్ల గురించి మాట్లాడుకున్నట్లయితే.. ఇది హైడ్రేషన్ కోసం ఉత్తమంగా పనిచేసే ఎలక్ట్రోలైట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీర ద్రవాలను సమతుల్యం చేయడానికి, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే, కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు తక్షణ శక్తిని ఇస్తాయి.

నిమ్మకాయ నీటి ప్రయోజనాలు..

లెమన్ వాటర్ తక్కువ కేలరీల పానీయం.. నిమ్మరసంలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక సీజనల్ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది కాకుండా, ఇది మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

నిమ్మకాయ ఆమ్లంగా ఉన్నప్పటికీ, ఆల్కలీన్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా ఇది శరీరం PH స్థాయిని నిర్వహించడానికి పనిచేస్తుంది. వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

నిమ్మ నీరు లేదా కొబ్బరి నీరు, హైడ్రేషన్‌కు ఏది మంచిది?

వేసవి కాలంలో మీ శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి రక్షించుకోవడానికి మీరు నిమ్మరసం.. కొబ్బరి నీరు రెండింటినీ తాగవచ్చు. ఒకవైపు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లోపాన్ని భర్తీ చేస్తే, మరోవైపు నిమ్మరసం సహజంగా శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ సహాయంతో, మీరు వ్యాయామం చేయడానికి ముందు లేదా వ్యాయామం చేసిన తర్వాత కూడా అలసిపోరు.

ఖాళీ కడుపుతో నిమ్మనీరు.. కొబ్బరి నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

నిమ్మకాయ నీటిలో ఉండే విటమిన్ సి శరీరం నుండి ఆక్సీకరణ ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది. వేసవి కాలంలో మీరు అధిక చెమట కారణంగా త్వరగా అలసిపోతారు. అటువంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీటిని తాగడం ద్వారా మీ రోజును ప్రారంభించవచ్చు. అంతేకాకుండా.. రోజంతా రిఫ్రెష్‌గా, యాక్టివ్‌గా ఉండేందుకు మీరు రోజులో ఎప్పుడైనా నిమ్మకాయ నీటిని సిద్ధం చేసుకోని త్రాగవచ్చు.. అయితే, కొబ్బరినీరు, నిమ్మరసం.. రెండూ పానీయాలు డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడి.. ఆరోగ్యంగా ఉంచుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి.. భద్రతా ఏర్పాట్లు పూర్తి
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. పరీక్షలు వాయిదా!
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్