Cancer Risk: పొగ తాగడం వల్ల నోటి క్యాన్సర్‌ మాత్రమే కాదు.. శారీరంలో ఈ భాగాలకు కూడా ముప్పు తప్పదు!

పొగాకు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ధూమపానం ధమనులను బలహీనపరిచి, వాటి పనితీరును బలహీనపరుస్తుంది. ఇది కరోనరీ హార్ట్ డిసీజ్ కారణమై గుండెపోటుకు దారితీస్తుంది. గత కొన్నేళ్లుగా గుండెజబ్బుల సంఖ్య పెరగడం వెనుక ధూమపానం ప్రధాన కారణమని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అయితే బీడీలు, సిగరెట్లే మాత్రమేకాదు.. గుట్కా తినడం, పొగాకు ఉత్పత్తులను తినడం వల్ల కూడా ఆరోగ్యానికి తీవ్ర..

Cancer Risk: పొగ తాగడం వల్ల నోటి క్యాన్సర్‌ మాత్రమే కాదు.. శారీరంలో ఈ భాగాలకు కూడా ముప్పు తప్పదు!
Smoking

Updated on: Jul 02, 2024 | 8:23 PM

పొగాకు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ధూమపానం ధమనులను బలహీనపరిచి, వాటి పనితీరును బలహీనపరుస్తుంది. ఇది కరోనరీ హార్ట్ డిసీజ్ కారణమై గుండెపోటుకు దారితీస్తుంది. గత కొన్నేళ్లుగా గుండెజబ్బుల సంఖ్య పెరగడం వెనుక ధూమపానం ప్రధాన కారణమని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అయితే బీడీలు, సిగరెట్లే మాత్రమేకాదు.. గుట్కా తినడం, పొగాకు ఉత్పత్తులను తినడం వల్ల కూడా ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతోనోరు, ఊపిరితిత్తుల నుంచి మొదలుకొని శరీరంలోని వివిధ అవయవాలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ధూమపానం, పొగాకు వినియోగం కేవలం నోటికి మాత్రమేకాకుండా శరీరంలోని వివిధ భాగాలలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, కడుపు, మూత్రాశయం, మూత్రపిండాలు, క్లోమం, గర్భాశయ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అధిక ధూమపానం కూడా మన మెదడులోని రక్తనాళాల లైనింగ్‌లో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందట. ఫలితంగా ధూమపానానికి అలవాటు పడిన వారిలో కూడా అధిక రక్తపోటుతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. బలహీనమైన రక్త నాళాలు కరోనరీ హార్ట్ డిసీజ్, గుండెపోటు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధూమపానం మానేయడం ఎలా?

ధూమపానం లేదా గుట్కాకు అలవాటుపడిన వారు ఒక్క రోజులో మానేయ కూడదు. క్రమంగా ఈ అలవాటును వదిలించుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పొగ త్రాగాలని లేదా గుట్కా తినాలని అనిపించినప్పుడు దానిని విస్మరించడానికి.. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోనేలా చూసుకోవాలి. దీనితోపాటు నిపుణుల సిఫార్సుపై నికోటిన్ ఇన్హేలర్, చూయింగ్‌ గమ్‌ లాంటివి ఉపయోగించడం ద్వారా ధూమపానం అలవాటును మానేయవచ్చు. అయితే వాటిని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us