Bay Leaves Benefits: బిర్యానీ ఆకులతో బోలెడన్నీ ప్రయోజనాలు.. ముఖ్యంగా వారికి బెటర్‌ మెడిసిన్‌..!

|

Aug 30, 2022 | 6:22 PM

ఇందులో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అనేక వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఈ ఆకులో పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. శరీరానికి మేలు చేసే..

Bay Leaves Benefits: బిర్యానీ ఆకులతో బోలెడన్నీ ప్రయోజనాలు.. ముఖ్యంగా వారికి బెటర్‌ మెడిసిన్‌..!
Bay Leaves
Follow us on

Bay Leaves Benefits: బిర్యానీ… భోజన ప్రియులకు నోరూరించే వంటకం.. బిర్యానీ అంటే అందులో బిర్యానీ ఆకులు(bay leaves) తప్పనిసరిగా వేయాల్సిందే. ఇవి మాంసాహారానికే కాకుండా శాఖాహారానికి కూడా చక్కని రూచిని ఇస్తాయి. ఆహారానికి రుచితో పాటుగానే..శరీరానికి కూడా మంచి పోషకాలను అందిస్తుంది ఈ బిర్యానీ ఆకు. ఇందులో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. అనేక వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు ఈ ఆకులో పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. శరీరానికి మేలు చేసే పొటాషియం, కాపర్, మెగ్నీషియం జింక్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు బిర్యానీ ఆకులో లభిస్తాయి. బిర్యానీ ఆకు ప్రయోజనాలు ఎంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు.. రాత్రి పడుకునే ముందు 2 ఆకులను తీసుకొని దానిని కాల్చి గదిలో ఉంచడం వల్ల దాని లోంచి వచ్చే పొగ కారణంగా ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. ఖచ్చితంగా ఈ బిర్యానీ ఆకులను తినడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ఈ ఆకులను నీటిలో మరిగించి వాటిలో కర్చీఫ్‌ లాంటి క్లాత్‌ని అది..ఛాతీపై ఉంచితే శ్వాస సమస్య దూరమవుతుందట.

బిర్యానీ ఆకులను ఉపయోగించి అరోమాథెరపీ చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో విశ్రాంతి లభిస్తుందట. ఈ బిర్యానీ ఆకు టైప్- 2 డయాబెటిస్ రోగులకు మంచి ఔషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆకులో ఉండే ఔషద గుణాల వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)