కుక్కను పెంచుతున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!

విశ్వాసంలో కుక్కను మించిన జంతువు లేదు. ఇదందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి దాన్ని సాకితే చాలు.. మన కష్టకాలంలో కూడా అది మన వెంటే ఉంటుంది. అందుకే ఎంతోమంది కుక్కలను పెంచుకుంటారు. అయితే కొందరు కాపలా కోసం పెంచుకుంటుండగా.. మరికొందరు ఇష్టంతో పెంచుకుంటారు. ఇక ఇలా కుక్కలను పెంచడం వల్ల ఎక్కువగా ఆరోగ్యానికి లాభం చేకూరుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కుక్కలు పెంచుతున్న వాళ్ళు అటు శారీరికంగా.. ఇటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని […]

కుక్కను పెంచుతున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!
Follow us

|

Updated on: Nov 10, 2019 | 8:48 PM

విశ్వాసంలో కుక్కను మించిన జంతువు లేదు. ఇదందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి దాన్ని సాకితే చాలు.. మన కష్టకాలంలో కూడా అది మన వెంటే ఉంటుంది. అందుకే ఎంతోమంది కుక్కలను పెంచుకుంటారు. అయితే కొందరు కాపలా కోసం పెంచుకుంటుండగా.. మరికొందరు ఇష్టంతో పెంచుకుంటారు. ఇక ఇలా కుక్కలను పెంచడం వల్ల ఎక్కువగా ఆరోగ్యానికి లాభం చేకూరుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కుక్కలు పెంచుతున్న వాళ్ళు అటు శారీరికంగా.. ఇటు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని స్వీడన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు పెంచుతుంటే.. వారు కాస్త ఎక్కువ కాలం జీవిస్తారట. ఇక దీన్ని రుజువు చేస్తూ వారు దాదాపు 20 ఏళ్ళ క్రితం గుండె జబ్బుల బారిన పడిన వాళ్ళను ఎంపిక చేసి.. వారిలో ఎంతమంది కుక్కలను పెంచారో.. ఎవరెవరు పెంచలేదన్నది లెక్కలు కట్టి.. వాళ్ళ జీవనకాలాన్ని అధ్యయనం చేశారట. అందులో కుక్కలను పెంచినవాళ్ల మరణాల సంఖ్య 33 శాతం తక్కువగా ఉండటం గమనార్హం.

అంతేకాకుండా ఒంటరిగా జీవిస్తూ కుక్కలు పెంచుకుంటున్న వారి మరణాలు కూడా 15 శాతం తక్కువగా ఉన్నాయట. దీని బట్టి చూస్తే.. ఒంటరితనంతో బాధపడే వారు.. గుండె జబ్బులు కలిగి ఉన్న వారు కుక్కల్ని పెంచుకుంటే.. వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా రోజువారీ జీవితంలో మనకి కలిగే బాధలను మర్చిపోవడానికి తోడుగా ఓ కుక్క ఉంటే మానసికంగా అన్నీ కూడా మర్చిపోగలం.