గులాబి గూటికి అజహర్..విజయం తర్వాత ఏమన్నారంటే?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన అజారుద్దిన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన చూపు ఇప్పుడు టీఆర్‌ఎస్ వైపు  మళ్లినట్టు తెలుస్తోంది. అజార్  ప్రస్తుతం టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా ఆయన గెలుపుకు టీఆర్‌ఎస్ పార్టీ పరోక్షంగా సహకరించినట్టు సమాచారం. ఇక అధికార టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వివేక్ ఈ పదవి కోసం ఈసారి కూడా గట్టిగా ప్రయత్నించారు. అయితే.. ఆయన నామినేషన్ రద్దు కావడంతో ప్రకాశ్ చంద్ […]

గులాబి గూటికి అజహర్..విజయం తర్వాత ఏమన్నారంటే?
Follow us

|

Updated on: Sep 27, 2019 | 7:36 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన అజారుద్దిన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన చూపు ఇప్పుడు టీఆర్‌ఎస్ వైపు  మళ్లినట్టు తెలుస్తోంది. అజార్  ప్రస్తుతం టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా ఆయన గెలుపుకు టీఆర్‌ఎస్ పార్టీ పరోక్షంగా సహకరించినట్టు సమాచారం. ఇక అధికార టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వివేక్ ఈ పదవి కోసం ఈసారి కూడా గట్టిగా ప్రయత్నించారు. అయితే.. ఆయన నామినేషన్ రద్దు కావడంతో ప్రకాశ్ చంద్ జైన్‌కు మద్దతిచ్చారు. దీంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

తనకు ఎన్నాళ్లుగానో అందని ద్రాక్షగా ఉన్న హెచ్‌సీఏ ప్రెసిడెంట్ పదవిని దక్కేలా చేసినందుకు అజారుద్దిన్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని సమాచారం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు కేసీఆర్ హెచ్‌సీఏ కమిటీకి అపాయిట్‌మెంట్ ఇవ్వలేదు. కాగా అజర్ నేతృత్వంలోని కమిటీ నేడు సీఎం కేసీఆర్‌తో భేటీ కానుంది. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరిక లాంఛనమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  హెచ్‌సీఏలో అజారుద్దీన్ గెలుపు కోసం తెర వెనుక మంత్రి కేటీఆర్ చక్రం తిప్పారని తెలుస్తోంది. మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి ద్వారా అజారుద్దీన్ విజయానికి కేటీఆర్ కృషి చేశారని సమాచారం.

కాగా పార్టీ మార్పు పై స్పందించిన అజారుద్దీన్ స్పందించారు. సీఎం ను కలవడానికి… ప్యానెల్ తో సహా వెళ్తున్నాను.  రాష్ట్రానికి బాస్  కేసీఆర్ అన్న అజహర్..టీఆర్ఎస్ లో జాయిన్ అవుతానా లేదా అనేది చెప్పేందుకు ఇప్పుడు సమయం కాదని పేర్కొన్నారు.

74 ఓట్లతో అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్  ఘన విజయం సాధించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో ప్రధానంగా మూడు ప్యానెల్స్ బరిలో నిలిచాయి. అయితే, వాటిలో అజారుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానెళ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. దిలీప్ కుమార్ ప్యానెల్ కూడా బరిలో ఉన్నా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హెచ్‌సీఏలో మొత్తం 226 మంది సభ్యులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరిగింది. 4 గంటలకు ఫలితాలను వెల్లడించారు.