పాకిస్థాన్‌కు కేంద్రమంత్రి బంపర్ ఆఫర్..

పొరుగు దేశం పాకిస్థాన్‌కు భారత్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా భారత్‌తో చర్చలకు ప్రయత్నిస్తుంటే.. మోదీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదంటూ పాక్ చేస్తున్న ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కౌంటర్ ఎటాక్ చేశారు. మీకు నిజంగా మాతో చర్చలు జరపాలని ఉంటే.. వెంటనే మీ దేశంలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను, టెర్రరిస్టులను భారత్‌కు అప్పగించాలంటూ పాక్‌కు సూచించారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం […]

పాకిస్థాన్‌కు కేంద్రమంత్రి బంపర్ ఆఫర్..
Follow us

| Edited By:

Updated on: Nov 16, 2019 | 1:49 AM

పొరుగు దేశం పాకిస్థాన్‌కు భారత్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా భారత్‌తో చర్చలకు ప్రయత్నిస్తుంటే.. మోదీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదంటూ పాక్ చేస్తున్న ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కౌంటర్ ఎటాక్ చేశారు. మీకు నిజంగా మాతో చర్చలు జరపాలని ఉంటే.. వెంటనే మీ దేశంలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను, టెర్రరిస్టులను భారత్‌కు అప్పగించాలంటూ పాక్‌కు సూచించారు.

ఇటీవల జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత భారత్, పాక్‌ల మధ్య దూరం అమాంతం పెరిగింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలోనే.. పాకిస్థాన్‌ విదేశాగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మేము స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని.. కానీ భారత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడంలేదంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయన్నారు. అయితే పాక్ విదేశాంగా మంత్రి వ్యాఖ్యలపై జైశంకర్ గట్టి సమాధానమే ఇచ్చారు.

భారత్‌తో సత్సంబంధాల్ని పెట్టుకోవాలని పాకిస్థాన్ నింజగా పరితపిస్తే.. దావుద్ ఇబ్రహీం, హఫీజ్ సయ్యీద్ లాంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, క్రిమినల్స్‌ను భారత్‌కు అప్పగించాలన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన మాట నిజమేనన్న మంత్రి.. దీనికి ప్రధాన కారణం పాకిస్థాన్‌ ఓ టెర్రరిస్ట్‌ హబ్‌గా మారడమేనన్నారు. భారత్‌లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతుందన్నారు. నిజంగా పాకిస్థాన్‌ చర్చలకు సుముఖత చూపితే.. తొలుత ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో