Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుపై షాకింగ్ నిజాలు అంటూ చెప్పిన డాక్టర్. సుశాంత్ ది ఆత్మహత్య కాదు.అతనిని కొట్టి చంపి .. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని రక్షణ శాఖ ఆర్డినెన్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న మీనాక్షి మిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు . వీడియోలో మృతదేహంపై గాయాలు , పడి ఉన్న తీరును విశ్లేషించిన డాక్టర్. ట్విట్టర్ లో వీడియో ని చూపిస్తూ... చెప్పిన డాక్టర్.
  • విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేశ్. నిమ్మగడ్డ పునర్నియామకం పై నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ,రాష్ట్ర ఎన్నికల కమిషన్. గవర్నర్ నోటిఫికేషన్ మేరకు శుక్రవారమే భాద్యతలు చేపట్టాను. సంభదిత అధికారులకు ,ఎన్నిక ల తెలియ చేసాను. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ. రాగ ద్వేషాలకు అతీతంగా నే ఎపుడూ ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుంది. తమ విధుల నిర్వహణ లో గతంలో ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందని ఆశిస్తున్నా ను.
  • టాలీవుడ్ దర్శకుడు తేజ కు కారోనా పాజిటివ్ గత వారం వెబ్ సిరీస్ షూటింగ్ డైరెక్ట్ చేసిన తేజ యూనిట్ సబ్యులకు, కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు, తేజకు తప్ప అందరికి నెగిటివ్.
  • చెన్నై: అయోధ్య లో రామమందిరం నిర్మాణం ఫై స్పందించిన కంచి పీఠాధిపతి స్వామి విజయేంద్ర సరస్వతి. ఆలయ నిర్మాణం ఫై 1986 నుండి నేటి వరకు ఎన్నో ఇబ్బందులను అధిగమించి నేడు భూమి పూజ నిర్వహించడం చాల శుభపరిణామం . ప్రజలందరూ కులమతాలకు అతీతం గా దేశ భక్తి ,దైవ భక్తి ప్రతిభింబించేలా రామమందిరం నిర్మాణానికి సహకరించాలి .
  • అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. గవర్నర్‌కు ఫోన్‌చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం. దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, జీవితంలో సంతోషం నింపాలని కోరుకుంటున్నాన్న సీఎం జగన్.

చిరు డైలాగ్‌తో ఎన్టీఆర్‌కి ఛాలెంజ్ విసిరిన సుమ..! అందేంటంటే..?

Green India challenge: Anchor Suma challenges Jr NTR, చిరు డైలాగ్‌తో ఎన్టీఆర్‌కి ఛాలెంజ్ విసిరిన సుమ..! అందేంటంటే..?

జూనియర్ ఎన్టీఆర్‌కి.. యాంకర్ సుమ ఛాలెంజ్ విసిరింది. అందులోనూ.. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన స్టాలిన్‌ సినిమాలోని.. డైలాగ్‌ చెప్పి మరీ ఎన్టీఆర్‌కి సుమ ఛాలెంజ్ విసిరింది. స్టాలిన్‌ సినిమాలోని ‘నువ్వు ముగ్గురికి సాయం చేయి.. ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పు’ అనే డైలాగ్.. అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం అదే డైలాగ్‌ని ఇప్పుడు ‘గ్రీన్‌ ఛాలెంజ్’ సారాంశంతో నడుస్తోంది. ఇందులో భాగంగానే.. యాంకర్ సుమ.. జూనియర్ ఎన్టీఆర్‌‌కి గ్రీన్ ఛాలెంజ్ విసిరింది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ‘గ్రీన్ ఛాలెంజ్’ అనేది ట్రెండ్ అవుతోంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు.. వాళ్ల పరిధిలోని వారికి ఈ ఛాలెంజ్‌ని విసురుతున్నారు. కాగా.. అందులో భాగంగానే.. ప్రముఖ సినీనటి జయసుధ, యాంకర్ అనసూయలు.. సుమకు ఛాలెంజ్ విసిరారు.

దీనికి.. సుమ స్పందిస్తూ.. తనకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన ప్రముఖ సినీ నటి జయసుధ, అనసూయకు థాంక్యూ చెప్తూ.. పచ్చటి మొక్కలను నాటింది. ఈ సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్‌, మంచు లక్ష్మీ, యాంకర్ ఓంకార్, బిగ్‌బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌లకి ఆమె ఈ గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు. అలాగే.. భావితరాలు సంతోషంగా.. ఆరోగ్యంతో ఉండాలంటే.. ఇలాంటి ఛాలెంజ్‌లు అవసరమని ఆమె చెప్పింది. మొక్కలతో.. వాయు కాలుష్యం తగ్గుతుందని పేర్కొంది సుమ కనకాల.

Related Tags