రేపటి నుంచి పార్లమెంట్.. వ్యూహాలకు పదునుపెడుతున్న పార్టీలు

పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ కోనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు లోక్‌సభలో తమ సభా నాయకుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అటు ఈ సారి త్రిపుల్ తలాక్, మెడికల్ కౌన్సిల్ బిల్లులు సహా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే త్రిపుల్ తలాక్ బిల్లుపై ప్రతిపక్షాలు కొన్ని సవరణలు కోరే అవకాశం ఉంది. త్రిపుల్ తలాక్ చెప్పిన వారికి జైలు శిక్ష అంశంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలపనున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభలో బిల్లు పాస్ అయినప్పటికీ రాజ్యసభలో బిల్లు నిలిచిపోయింది. బడ్జెట్, బిల్లుల విషయంలో సహకరించాలని ప్రతిపక్ష పార్టీలను అధికారపక్షం కోరనుంది. ఈ సారి లోక్‌సభ పనితీరును మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అఖిలపక్ష సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ పార్టీల నేతల హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *