Breaking News
  • తిరుమల: శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు. రేపు ఏకాంతంగా రాములవారి పట్టాభిషేకం. ఈరోజు హనుమంత వాహన సేవను రద్దు చేసిన టీటీడీ. రెండు ఘాట్‌ రోడ్డులు మూసివేసిన టీటీడీ అధికారులు.
  • తిరుపతి: ఆస్సాంలో జరిగిన ఇస్తెమాతో కరోనా పాజిటివ్‌ కేసులు. గత నెల 18, 19 తేదీల్లో ఆస్సాం గోల్‌పరాలోని మసీదులో ఇస్తెమా. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ఆస్సాం వెళ్లిన 12 మంది. ఆస్సాం వెళ్లివచ్చిన ముగ్గురు పలమనేరు వాసులకు కరోనా పాజిటివ్‌. బెంగుళూరు, చెన్నై సభలలో పాల్గొన్న మరో 121 మంది గుర్తింపు. వారి నుంచి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపిన అధికారులు.
  • కడప నగరాన్ని బఫర్‌ జోన్‌గా ప్రకటించిన జిల్లా ఎస్పీ అన్బురాజన్‌. నగరంలోని పలు ప్రాంతాల రహదార్లు మూసివేత. నిత్యావసర వస్తువులు ఇంటికే సరఫరా చేస్తామంటున్న పోలీసులు. లాక్‌డౌన్‌కు సహకరించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక.
  • ప.గో: కాళ్ళ పోలీస్‌స్టేషన్‌కు కరోనా ఎఫెక్ట్‌. హెడ్‌కానిస్టేబుల్‌ కుమారుడికి సోకిన కరోనా వైరస్‌. అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు. స్టేషన్‌ సిబ్బందిని హోం క్వారంటైన్‌కు పంపిన అధికారులు. సిబ్బంది కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులు.
  • ప్రకాశం: చీమకుర్తిలో కరోనా కలకలం. కరోనా బాధితుడి స్నేహితులు, బంధువులను క్వారంటైన్‌కు తరలింపు. మొత్తం 21 మందిని క్వారంటైన్‌ సెంటర్లో చేర్చిన అధికారులు.

Good News.. పసిడి పరుగులకు బ్రేక్.. రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధర

Gold prices slump today after hitting record high, Good News.. పసిడి పరుగులకు బ్రేక్.. రికార్డు స్థాయిలో తగ్గిన బంగారం ధర

గత కొద్ది రోజులుగా బ్రేకులు ఫెయిల్ అయిన బండిలా పరుగులెత్తిన బంగారం ధరలకు.. మంగళవారం సడన్ బ్రేకులు పడ్డాయి. ఏకంగా ఒక్కరోజే.. పది గ్రాములకు రూ.1200/- తగ్గింది. గత ఐదురోజుల్లో పదిగ్రాముల బంగారం క్రమక్రమంగా పెరుగుతూ.. ఏకంగా రూ. 3000 పెరిగి రూ.45వేలకు పైగా చేరుకుంది. అయితే అదే స్థాయిలో ఒక్కసారిగా మంగళవారం ధర పడిపోయింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1200 తగ్గి (పది గ్రాములకు) రూ.42,855కి చేరుకుంది.

ఐదు రోజుల తర్వాత.. మంగళవారం రోజు బంగారం ధర తగ్గంది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి కూడా రూ. 1495 తగ్గి రూ. 47,910కి చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం ఓ రీజన్ అయితే.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధరలు పడిపోవడం మరో రీజన్‌ అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

Related Tags