ఉరకలేస్తున్న గోదారమ్మ.. భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు

ఎగువ కురుస్తున్న వర్షాలకు గోదారమ్మ ఉరకలేస్తోంది. భారీగా వరదీ నీరు వచ్చి చేరుతుండడంతో గోదావరి మరో సారి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని గోసిఖుర్ధా, వెన్‌గంగాపై నిర్మించిన చిఛ్చోడా బ్యారేజీ గేట్లు ఎత్తడంతో భారీగా ప్రవాహం వస్తోంది.

ఉరకలేస్తున్న గోదారమ్మ.. భారీగా వచ్చి చేరుతున్న వరదనీరు
Follow us

|

Updated on: Sep 03, 2020 | 8:08 AM

ఎగువ కురుస్తున్న వర్షాలకు గోదారమ్మ ఉరకలేస్తోంది. భారీగా వరదీ నీరు వచ్చి చేరుతుండడంతో గోదావరి మరో సారి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని గోసిఖుర్ధా, వెన్‌గంగాపై నిర్మించిన చిఛ్చోడా బ్యారేజీ గేట్లు ఎత్తడంతో భారీగా ప్రవాహం వస్తోంది. కాళేశ్వర త్రివేణి సంగమం వద్ద 12.29 మీటర్ల ఎత్తున గోదావరి ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరంలో పుష్కరఘాట్లు పూర్తిగా నీటి మునిగిపోయాయి. సమీప గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. బుధవారం మేడిగడ్డ బ్యారేజీలోకి 9.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 75 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇక, భద్రాచలం వద్ద బుధవారం ఉదయం 40.4 అడుగుల మేర ఉన్న గోదావరి.. సాయంత్రానికి 41.6 అడుగులకు చేరుకుంది. గురువారం ఉదయానికి 43 అడుగులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలోని జైక్వాడ్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్న నేపథ్యంలో శ్రీరామసాగర్‌కు ఏ క్షణమైనా వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అటు కృష్ణమ్మ కాస్త శాంతించింది. నాగార్జునసాగర్‌ నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. కాగా వరద కాల్వ ద్వారా సూరమ్మ చెరువుకు నీటిని తరలించి 60 వేల ఎకరాలకు సాగు సౌకర్యం కల్పించనున్నారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!