GHMC Elections:బ్యాలెట్ పేపర్‌పై గుర్తు తారుమారు.. సీపీఐకి బదులు సీపీఎం గుర్తు.. ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ ఈసీ ఆదేశం

ఓల్డ్ మలక్‌పేట్ 26వ డివిజన్‌లో రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

GHMC Elections:బ్యాలెట్ పేపర్‌పై గుర్తు తారుమారు.. సీపీఐకి బదులు సీపీఎం గుర్తు.. ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్ ఈసీ ఆదేశం
Follow us

|

Updated on: Dec 01, 2020 | 2:54 PM

ghmc elections: ఓల్డ్ మలక్‌పేట్ 26వ డివిజన్‌లో రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సీపీఐ పార్టీ గుర్తు కంకి కొడవలికి బదులుగా సీపీఎం గుర్తు సుత్తి కొడవలి ముద్రించారు. దీంతో సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే పోలింగ్ నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్టేట్ ఎలక్షణ్ కమిషనర్ పార్థసారధి ఈనెల 3వ తేదీన గురువారం 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.

అయితే, ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డివిజన్ పరిధిలో పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. బ్యాలెట్ పేపర్‌లో ఒక గుర్తుకు బదులు మరో గుర్తును కేటాయించారని ఆరోపించారు. సీపీఐ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థికి కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలి గుర్తును కేటాయించారని తెలిపారు. దీంతో వెంటనే పోలింగ్ నిలిపివేసి, మళ్లి సరియైన బ్యాలెట్ పేపర్‌ను ముద్రించాలని సీపీఐ నేతలు కోరారు.

కాగా, గుర్తు తారుమారుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్ధసారథి క్లారిటీ ఇచ్చారు. ఓల్డ్‌ మలక్‌పేట్‌ ఘటనలో సింబల్‌ ఛేంజ్‌పై ఆర్‌వో మీద చర్యలు తీసుకుంటామన్నారు. ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఈ పొరపాటు జరిగినట్టు గుర్తించామన్నారు ఎస్‌ఈసీ పార్థసారథి. అయితే ఎక్కడా ఓట్లు గల్లంతు కాలేదన్న పార్ధసారథి.. రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒకే పోలింగ్‌ కేంద్రానికి బదిలీ చేశామన్నారు.