Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

చేతులతో అన్నం తింటున్నారా.. ఇది మీకోసమే.!

Eating Food With Hands Is An Emotion, చేతులతో అన్నం తింటున్నారా.. ఇది మీకోసమే.!

మన అమ్మా, అమ్మమ్మలు చిన్నతనంలో చేతులతో కలిపి అన్నం పెడుతుంటే.. మనం ఆస్వాదిస్తూ తినేవాళ్ళం. అది అమ్మ ముద్దలో ఉండే మాధుర్యం. అలాగే అన్నాన్ని ఐదు వేళ్ళతో కలుపుకుని చేతులతో ఆస్వాదిస్తూ తినడం అదొక ఎమోషన్.. చాలామంది అలా తినడం వల్ల తృప్తి చెందుతుంటారు. ఇక అలా చేతులతో ఆహారం తినేవాళ్లు వాళ్లకి తెలియకుండానే ఆరోగ్యాన్ని ఎంతో పదిలంగా ఉంచుకుంటున్నారు.

ఇప్పుడు మారిన పరిస్థితుల బట్టి చాలామంది యువత చేతులతో తినడం మానేసి స్పూన్లు, ఫోర్కులు ఉపయోగిస్తున్నారు. ఇక ఈ విధంగా తినేవాళ్ల కంటే చేతులతో ఆస్వాదిస్తూ తినేవాళ్లే వందేళ్లు హాయిగా బతుకుతారని నిపుణులు అంటున్నారు. చేతులతో ఆస్వాదిస్తూ అన్నం తినడం వల్ల కండరాలకు పని పెరగడంతో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా తినటం వల్ల ఆహారంతో ఓ బంధం ఏర్పడుతుంది. దీంతో అన్నం విలువ మనకు తెలుస్తుంది.

మరోవైపు ఆయుర్వేదంలో నోట్లోకి చేతి వేళ్ల ద్వారా ఆహారాన్ని పంపించడాన్ని యోగ ముద్ర అని అంటారట. అది జ్ఞాన అవయవాలను యాక్టివేట్ చేయడమే కాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రసాలను జీర్ణాశయంలోకి విడుదల చేయడంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అటు చేతులతో ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వేదాలు సైతం చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా కొందరు చేతుల మీద అధికంగా బ్యాక్టిరీయా ఉంటుందని స్పూన్లు, ఫోర్కులను ఉపయోగిస్తుంటారు. అయితే చేతుల కంటే ఎక్కువగా బ్యాక్టిరీయా స్పూన్లకే ఉంటుంది. అందుకే స్పూన్లు, ఫోర్కులను వదిలేసి చక్కగా చేతులతో ఆస్వాదిస్తూ ఆహారాన్ని ఆరగించండి.. ఆరోగ్యంగా ఉండండి.

Related Tags