చేపల కోసం వేసిన వలలో చిక్కిన భారీ మొసలి

మత్యకారులు చేపల కోసం వేసిన వలలో భారీ మొసలి చిక్కింది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. స్థానిక నాన్ చెరువులో మత్యకారులు చేపల కోసం వేసిన వలలో భారీ మొసలి చిక్కుకుంది. ఉదయం చెరువు దగ్గరకు వెళ్లిన మత్స్యకారులు వలలో మొసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మొసలిని బయటకు తీయడానికి ప్రయత్నం చేయగా రాకపోవడంతో గ్రామస్థులు వేరే పెద్దవలలు వేసి ఎట్టకేలకు మొసలిని బయటకు తీశారు. అధికారులకు సమాచారం […]

చేపల కోసం వేసిన వలలో చిక్కిన భారీ మొసలి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 01, 2020 | 2:26 PM

మత్యకారులు చేపల కోసం వేసిన వలలో భారీ మొసలి చిక్కింది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. స్థానిక నాన్ చెరువులో మత్యకారులు చేపల కోసం వేసిన వలలో భారీ మొసలి చిక్కుకుంది. ఉదయం చెరువు దగ్గరకు వెళ్లిన మత్స్యకారులు వలలో మొసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మొసలిని బయటకు తీయడానికి ప్రయత్నం చేయగా రాకపోవడంతో గ్రామస్థులు వేరే పెద్దవలలు వేసి ఎట్టకేలకు మొసలిని బయటకు తీశారు. అధికారులకు సమాచారం అందించడంతో అటవీ అధికారులు వచ్చి మొసలిని బిచుపల్లి దగ్గర కృష్ణా నదిలో వదలడం కోసం తీసుకెళ్లారు. మొసలిని చూడటానికి గ్రామస్థులు అధిక సంఖ్యలో వచ్చారు.