వాహనాలు మురికిగా ఉన్నా ఫైన్ తప్పదు..!

Fine for Dirty Vehicles in Dubai, వాహనాలు మురికిగా ఉన్నా ఫైన్ తప్పదు..!

ఇప్పటికే కొత్త వాహన చట్టాలు అమలులోకి వచ్చిన తరువాత దేశంలో భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ‘భరత్ అనే నేను సినిమా’లోని సీన్‌ని రియల్ చేయనుంది. చిన్న చిన్న తప్పులకు కూడా భారీ జరిమానా విధించనుంది. సెప్టెంబర్ 1 నుంచే వీటిని.. ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇక వీటికి సంబంధించి..  పలు వాహనాలపై.. భారీ జరిమానాలు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అయితే.. ఈ రూల్స్ కేవలం ప్రజలకే కాకుండా… అధికారులకు కూడా అని రెవెన్యూ, పోలీస్ శాఖ ఇప్పటికే సమాచారం ఇచ్చింది.

కాగా.. ఇలాంటి ట్రాఫిక్ రూల్స్.. మనదేశంలోనే ఉన్నాయి అనుకుంటే.. పొరపాటే. అమెరికా, రష్యా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో భారీగా ట్రాఫిక్ ఫైన్లు ఉన్నాయి. అమెరికా వంటి దేశాల్లో.. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే.. 25 డాలర్లు, డ్రైవింగ్ లైసెన్స్ 1000 డాలర్లు, హెల్మెట్ లేకుంటే 300 డాలర్లు చలానా విధిస్తారు. అయితే… విదేశాల్లో.. పరిశుభ్రతకు కూడా ఎక్కువగా ప్రాముఖ్యత చూపిస్తారు. ముందు వాహనాలపై మురికి ఉంటే.. యజమానులను హెచ్చరిస్తారు. ఇది రీపీట్ అయితే.. కనుక.. వాహనాలపై ఫైన్ వేస్తారంట..! దుబాయ్ కరెన్సీలో.. 500 దిర్హామ్‌లు అట..! అంటే.. మన కరెన్సీలో.. లక్ష రూపాయలకు పై మాటనే. మళ్లీ ఆ వాహనం 15 రోజుల తరువాత కూడా అలానే కనిపిస్తే.. డంపింగ్ యార్డ్‌కు పంపిస్తారంట. వీటితో పోల్చుకుంటే.. మన దగ్గర ఉన్న ట్రాఫిక్ రూల్స్ తక్కువనే చెప్పాలి.

Fine for Dirty Vehicles in Dubai, వాహనాలు మురికిగా ఉన్నా ఫైన్ తప్పదు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *