FEATURED:

Digital Mojo: డిజిటల్ యుగంలో హైదరాబాద్ వ్యాపారాలకు దారి చూపుతున్న డిజిటల్ మోజో

Digital Mojo: హైదరాబాద్‌లోని టెక్, స్టార్టప్, రియల్ ఎస్టేట్ రంగాల్లో డిజిటల్ మోజో (Digital Mojo) డిజిటల్ మార్కెటింగ్ మార్గదర్శిగా నిలుస్తోంది. 2016లో స్థాపించిన ఈ సంస్థ AI-first approachతో Mojo Analytica, NOW ఫ్రేమ్‌వర్క్ ద్వారా డేటా ఆధారిత క్యాంపెయిన్‌లను అందిస్తుంది. బ్రాండింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌లతో బ్రాండ్‌లకు దీర్ఘకాలిక గుర్తింపు, లీడ్స్‌ను సాధించడంలో సహాయపడుతుంది..

Digital Mojo: డిజిటల్ యుగంలో హైదరాబాద్ వ్యాపారాలకు దారి చూపుతున్న డిజిటల్ మోజో
Digital Mojo

Updated on: Feb 18, 2026 | 5:21 PM

Digital Mojo: హైదరాబాద్ నగరంలోని టెక్నాలజీ, స్టార్టప్‌, రియల్ ఎస్టేట్ రంగాల్లో వేగంగా ఎదుగుతున్న కొద్దీ వ్యాపారాల మార్కెటింగ్ విధానాల్లో పెద్ద మార్పు కనిపిస్తోంది. కస్టమర్లను చేరుకోవడం, లీడ్స్ సాధించడం, బ్రాండ్ గుర్తింపును పెంచుకోవడం ఇవన్నీ ఇప్పుడు డిజిటల్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఈ మారుతున్న వ్యాపార వాతావరణంలో హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ డిజిటల్ మోజో అనేక బ్రాండ్‌లకు డిజిటల్ మార్గదర్శకంగా నిలుస్తోంది.

2016లో స్థాపించిన ఈ సంస్థ.. ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ సమీపంలో కార్యాలయాన్ని నిర్వహిస్తూ 60 మంది నిపుణులతో పనిచేస్తోంది. రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, ఫుడ్, బెవరేజ్, B2B రంగాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థకు దాదాపు 40% ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ రంగం నుంచే రావడం గమనార్హం. ఇది హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రాపర్టీ మార్కెట్‌కు నిదర్శనం.

డిజిటల్ మోజో ప్రత్యేకత:

అయితే డిజిటల్ మోజో ప్రత్యేకత ఏమిటంటే ఇది AI-first approachను అనుసరించడం. సంస్థ రూపొందించిన Mojo Analytica అనే అనలిటిక్స్ సిస్టమ్ ద్వారా క్యాంపెయిన్ పనితీరును ట్రాక్ చేస్తారు. అలాగే NOW (Network Outreach Workflow) అనే ప్రొప్రైటరీ ఫ్రేమ్‌వర్క్ ద్వారా డిజిటల్ క్యాంపెయిన్‌లను వ్యవస్థబద్ధంగా అమలు చేస్తారు. దీంతో బ్రాండ్‌లు డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది.

పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌తో పాటు బ్రాండ్ స్టోరీటెల్లింగ్‌కి కూడా ప్రాధాన్యత ఇస్తూ, సంస్థ తన బ్రాండింగ్ విభాగం Mojo.buzz ద్వారా బ్రాండ్ ఐడెంటిటీ, బ్రాండ్ ఆర్కిటెక్చర్, స్టోరీటెల్లింగ్ సేవలు అందిస్తోంది. తక్షణ లీడ్స్‌తో పాటు దీర్ఘకాలిక బ్రాండ్ గుర్తింపుని నిర్వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.

సోషల్ మీడియా వినియోగ విధానాల్లో వచ్చిన మార్పులు కూడా మార్కెటింగ్ వ్యూహాలను ప్రభావితం చేస్తున్నాయి. యూట్యూబ్ ప్రీమియం, ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ కల్చర్ పెరగడంతో, బ్రాండ్‌లు ఆర్గానిక్ స్టోరీటెల్లింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ అడ్వర్టైజింగ్ అన్నీ కలిపి వినియోగిస్తున్నాయి. డిజిటల్ మోజో ఈ మూడింటిని సమతుల్యంగా అమలు చేస్తోంది.

ఇప్పటి పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్ ఐచ్ఛికం కాదు. వ్యాపారం కొనసాగాలంటే డిజిటల్ ప్రెజెన్స్ తప్పనిసరి అని డిజిటల్ మోజో ఫౌండర్‌, సీఈవో ధీరజ్ మేరాణి తెలిపారు. ముఖ్యంగా మాధాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లోని కంపెనీలు డిజిటల్‌పై ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నాయని ఆయన చెప్పారు.

ISO 9001 సర్టిఫికేషన్ కలిగిన ఈ సంస్థ, Google, Meta వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లకు గుర్తింపు పొందిన భాగస్వామిగా పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ డెవలపర్లు, ఎంటర్‌ప్రైజ్ స్థాయి సంస్థలకు డిజిటల్ సపోర్ట్ అందిస్తోంది. హైదరాబాద్, స్టార్టప్‌లు, కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో మరింతగా ఎదుగుతున్న తరుణంలో డిజిటల్ వ్యూహాల ప్రాముఖ్యత ఇంకా పెరగనుంది. ఈ మార్పులో డిజిటల్ మోజో వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.