ఫేస్ బుక్ ఉద్యోగుల ప్రశ్నల తాకిడి.. సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ ఉక్కిరిబిక్కిరి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫేస్ బుక్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. మినియాపొలీస్ లో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళనలు చేస్తూ..

ఫేస్ బుక్ ఉద్యోగుల ప్రశ్నల తాకిడి.. సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ ఉక్కిరిబిక్కిరి
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 03, 2020 | 12:27 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫేస్ బుక్ మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. మినియాపొలీస్ లో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఆందోళనలు చేస్తూ.. లూటీలకు పాల్పడుతున్నవారిని షూట్ చేస్తానని ట్రంప్ చేసిన హెచ్చరికలు ఫేస్ బుక్ లో ఇంకా ఉండడంపై పలువురు ఉద్యోగులు ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమతో సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ నిర్వహించిన సమావేశంలో ఇదే అంశంపై ఆయనను నిలదీశారు. ట్రంప్ బెదిరింపు ధోరణి కంపెనీ పాలసీలను ఉల్లంఘించేదిగా ఉందని వీరిలో చాలామంది ఆరోపించారు. కానీ ట్రంప్ షేర్ చేసిన పోస్టులను అలా వదిలివేయాలన్న తన నిర్ణయంలో మార్పు ఉండదని జుకర్ బెర్గ్ స్పష్టం చేశారు. ట్రంప్ మెసేజ్ రెచ్చగొట్టేదిగా ఉందని తాను గానీ, తన పాలసీ టీమ్ గానీ భావించడం లేదని ఆయన వెల్లడించారు. అంటే కంపెనీ రూల్స్ ని ఇది అతిక్రమించేదిగా లేదని ఆయన భావించారని ఇద్దరు ఉద్యోగులు తెలిపారు. సంస్థ పాలసీని మార్చాలా లేక.. ఉద్రిక్తతను ప్రేరేపించేవిగా ఉన్న పోస్టులను ఎలా నియంత్రించాలా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారని వారు చెప్పారు.

తమ సిబ్బందితో జుకర్ బెర్గ్ సుమారు 90 నిముషాలసేపు సమావేశమయ్యారు. వీడియో స్ప్లిట్ స్క్రీన్ ద్వారా సిబ్బంది జుకర్ బెర్గ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘లూటింగ్ మొదలైతే షూటింగ్ (కాల్పులు) కూడా మొదలవుతాయని ట్రంప్ గత బుధవారం ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. అదే పోస్టును ట్విటర్ కూడా పోస్ట్ చేసింది. అయితే తమ బాస్ ధోరణి పట్ల ఫేస్ బుక్ సీనియర్ ఉద్యోగులు పలువురు కూడా నిరసన తెలిపారు. కొంతమంది వర్చ్యువల్ వాకౌట్ చేశారు. తిమోతీ అవేనీ అనే ఉద్యోగి ఈ నెల 1 న రాజీనామా చేస్తూ.. తమ సంస్థ వైఖరిని ఫేస్ బుక్ లోనే తీవ్రంగా తప్పు పట్టారు.

హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
హైదరాబాదీ వింత ఆలోచన.. నామినేషన్ దాఖలకు ఎలా వెళ్లాడో చూడండి
ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే..
ఆ ఒక్కటి అడక్కు సినిమాకు ముందుగా అనుకున్నది అతడినే..
OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!
OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!
ఎండాకాలం కాసులు కురిపించే బిజినెస్.. పెట్టుబడి చాలా తక్కువ
ఎండాకాలం కాసులు కురిపించే బిజినెస్.. పెట్టుబడి చాలా తక్కువ
ఒక్క సినిమా రూ.120 కోట్ల రెమ్యునరేషన్ | ముద్దుల హీరోగా డార్లింగ్.
ఒక్క సినిమా రూ.120 కోట్ల రెమ్యునరేషన్ | ముద్దుల హీరోగా డార్లింగ్.
కళ్లద్దాల వల్ల ముక్కు ఇరువైపులా మచ్చలు ఏర్పడ్డాయా?
కళ్లద్దాల వల్ల ముక్కు ఇరువైపులా మచ్చలు ఏర్పడ్డాయా?
ఎప్పుడూ జరిగితే అనుభవం. ఎప్పుడో జరిగితే అద్భుతం.! పుష్ప ఎంజాయ్.
ఎప్పుడూ జరిగితే అనుభవం. ఎప్పుడో జరిగితే అద్భుతం.! పుష్ప ఎంజాయ్.
ఆ సినిమా తర్వాత సిగరెట్లకు బానిసైన హీరోయిన్..
ఆ సినిమా తర్వాత సిగరెట్లకు బానిసైన హీరోయిన్..
అదిరే లుక్స్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌.. వివో నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌
అదిరే లుక్స్‌, ఆకట్టుకునే ఫీచర్స్‌.. వివో నుంచి స్టన్నింగ్‌ ఫోన్‌
ఉదయాన్నే హ్యాంగోవర్‌తో ఆఫీస్‌కు వెళ్లలేకపోతున్నారా?
ఉదయాన్నే హ్యాంగోవర్‌తో ఆఫీస్‌కు వెళ్లలేకపోతున్నారా?